చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్.. అందరూ ఫిదా?

praveen
మొన్నటి వరకు భారత్ లో కేవలం పురుషుల  క్రికెట్ కి మాత్రమే ఎక్కువగా క్రేజ్ ఉండేది. మహిళా క్రికెటర్లు ఎంతలా రాణించిన కూడా ప్రేక్షకులు అంతగా మహిళా క్రికెట్ ను ఆదరించే వారు కాదు. కానీ ఇటీవల కాలంలో పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లు కూడా అద్భుతంగా రాణిస్తూ ఉండటం ప్రస్తుతం ప్రేక్షకులందరినీ కూడా ఆకర్షిస్తోంది. అంతేకాదు ఇటీవల కాలంలో ఎంతో మంది భారత మహిళా క్రికెటర్లు ప్రపంచ క్రికెట్లో అరుదైన రికార్డులను కూడా సొంతం చేసుకుంటూ క్రికెట్ ప్రపంచం చూపు మొత్తం ఆకర్షిస్తూ  ఉన్నారు. ఇలా ఇటీవలి కాలంలో భారత మహిళా క్రికెటర్ లు సత్తా చాటుతున్నారు అని చెప్పాలి.

 అంతర్జాతీయ క్రికెట్లో రాణించడమే కాదు ఇటీవలే ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో కూడా ఎంతో మంది భారత క్రికెటర్లు స్థానం దక్కించుకొని సత్తా చాటుతున్నారు. ఇక ఇటీవల కాలంలో ఏకంగా భారత టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అదిరిపోయే సెంచరీ చేసి అదరగొట్టింది అన్న విషయం తెలిసిందే.
 ఇలా బిగ్ బాష్ లీగ్ లో సెంచరీ చేసిన మొదటి భారత మహిళా క్రికెటర్గా హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఇక అన్నీ మ్యాచులో కూడా అదే దూకుడును కొనసాగిస్తు జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ వచ్చింది హర్మన్ ప్రీత్ కౌర్. ఇటీవలే మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది ఈ మహిళా క్రికెటర్.

 ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో భారత ఉమెన్స్ టి20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్  ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా నిలిచి అరుదైన ఘనత సాధించింది. ఈ రికార్డు సృష్టించిన తొలి భారత మహిళా క్రికెటర్ గా సరికొత్త చరిత్రకు నాంది పలికింది హర్మన్ ప్రీత్ కౌర్. ఏకంగా లీగ్లో భాగంగా 14 మ్యాచుల్లో 399 పరుగులు చేసి 15 వికెట్లు తీసి ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది హర్మన్ ప్రీత్ కౌర్. దీంతో ఇక హర్మన్ ప్రీత్ కౌర్ ఆల్ రౌండ్ ప్రదర్శనకు అందరూ ఫిదా అయిపోయారు అని చెప్పాలి. ఇలా ప్రతి మ్యాచ్లో కూడా జట్టు విజయంలో  కీలకపాత్ర వహించిన హర్మన్ ప్రీత్ కౌర్ కు  ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్  అవార్డు దక్కడంపై అభిమానులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: