నేడే కోహ్లీకి చివరి టి20.. వద్దు అంటున్న ఫాన్స్?
విరాట్ కోహ్లీ ప్రకటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.. అయితే ఇక ఇక తన సారథ్యంలో చివరిగా టీమ్ ఇండియా ఆడిన వరల్డ్ కప్ లో అయినా విరాట్ కోహ్లీ గెలిపిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా టి20 వరల్డ్ కప్ లో కూడా టీమిండియా జట్టు పేలవ ప్రదర్శన చేసింది. వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో ఇక సెమీస్ అవకాశాలను ఎంతో కష్టంగా మార్చుకుంది. తర్వాత వరుసగా రెండు మ్యాచ్లలో అద్భుతమైన ప్రదర్శన చేసి భారీ తేడాతో విజయం సాధించడంతో రన్ రేట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరికి కూడా టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కి వెళ్తుంది అని ఆశ పెరిగిపోయింది. కానీ న్యూజిలాండ్ జట్టు ప్రదర్శనపై టీమిండియా భవిష్యత్తు ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి నిన్న జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు గెలవడంతో టీమిండియా ఇక ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా నేడు నమీబియా తో నామమాత్రమైన మ్యాచ్ ఆడబోతుంది. కాగా నేడు టి20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీకి చివరి మ్యాచ్ కావడంతో అభిమానులు అందరూ మరింత నిరాశ లో మునిగిపోయారు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని టీ20 కెప్టెన్గా కొనసాగాలి అంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు కోహ్లీ అభిమానులు.