క్రికెట్ లో అవార్డులు, రికార్డులు అన్నది మామూలే. అయితే ప్రేక్షకులు కానీ ఆయా దేశ ప్రజలు క ఈ ప్రతి రికార్డు, అవార్డులు వారికే రావాలని అనుకుంటూ ఉంటారు. అయితే అన్ని సార్లు మనకు అనుకూలంగా రాకపోవచ్చు. ప్లేయర్ ల ఆటను బట్టి వారికి రికార్డులు, అవార్డులు వస్తాయి. ఇప్పుడు ఈ చర్చ అంతా అనేదుకు అనుకుంటున్నారా? ఈ మధ్యనే ఐసీసీ ఒక పురస్కారాన్ని తీసుకు వచ్చింది. ప్రతి నెలకు ఒక క్రికెటర్ ను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపిక చేస్తూ వస్తున్నారు. అదే విధంగా గత నెల అక్టోబర్ కు సంబంధించి ప్లేయర్ ను సెలెక్ట్ చేయాల్సి ఉంది. అందుకు గానూ ఐసీసీ పరిశీలనలో ఉన్న ముగ్గురి ఆటగాళ్ళ పేర్లను ఈ రోజు ప్రకటించింది.
అయితే ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా ఇండియా ప్లేయర్ లేరు.
ఎందుకు ఉంటారు.. ఈ టీ 20 వరల్డ్ కప్ లో మన ప్లేయర్ ల ప్రదర్శన మరీ చెత్తగా ఉంది. అందుకే ఇండియా నుండి పురుషుల విభాగం నుండి ఒక్క క్రికెటర్ కూడా లేడు. ఈ ముగ్గురిలో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హాసన్, పాకిస్తాన్ కు చెందిన ఆసిఫ్ అలి మరియు నమీబియా డేవిడ్ వీజ్ ఉన్నారు. వీరు ముగ్గురూ ప్రస్తుతం జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ లో తమ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా షకీబ్ తన అల్ రౌండ్ ప్రదర్శనతో తన టీమ్ ను సూపర్ 12 కు తీసుకు రావడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అయితే గాయం కారణంగా ఆఖరి 3 మ్యాచ్ లకు షకీబ్ దూరమయ్యాడు. పాకిస్తాన్ హార్డ్ హిట్టర్ అసిఫ్ అలీ ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో వరుసగా 4 సిక్స్ లు కొట్టి పాకిస్తాన్ కు ఘన విజయాన్ని అందించాడు. డేవిడ్ వీజ్ సైతం నమీబియా జట్టును సూపర్ 12 కు తీసుకురావడంలో ప్రధాన భూమిక వహించాడు.
దీనితో ఈ వార్త తెలిసిన వారు మళ్లీ ఇండియా ఓడిపోయిన మ్యాచ్ లను గుర్తు చేసుకుంటూ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ మ్యాచ్ లలో గెలిచి ఉంటే ఒకరి పేరైనా లిస్ట్ లో ఉండేవారని అందరూ అభిప్రాయపడుతున్నారు.
మరి ఈ నెలలో అయినా ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ లో చోటు దక్కించుకుంటారా అన్నది చూడాలి.