దేశం కోసం ఆడండి.. డబ్బు కోసం కాదు.. టీమిండియాకు వార్నింగ్?
మొదట టి20 వరల్డ్ కప్ కప్ లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో పేలవా ప్రదర్శనలతో ఓడిపోయిన టీమిండియా ఇక రెండో మ్యాచ్లో కూడా తప్పు సరిదిద్దుకో లేదు. ఈ క్రమంలోనే ఇక రెండో మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది టీమిండియా. దీంతో టీమ్ ఇండియా సెమీ ఫైనల్ అవకాశాలు గల్లంతయ్యాయి అనే చెప్పాలి. అయితే వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్లను కలిగి ఉన్న టీమ్ ఇండియా జట్టు కనీసం సింగిల్స్ తీయడానికి కూడా ఇబ్బంది పడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన యువ ఆటగాళ్లు టి20 వరల్డ్ కప్ లో మాత్రం తేలిపోయారు. ఇక బౌలర్లు అయితే ప్రత్యర్థికి పరుగులు ఇవ్వడమే తప్ప వికెట్లు తీసుకోవడం మాత్రం చాలా అరుదుగా కనిపించింది.
కాగా టీమిండియా ప్రదర్శనపై ప్రస్తుతం అభిమానులందరూ తీవ్ర నిరాశతో ఉన్నారు అని చెప్పాలి.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా టీమిండియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఒక అభిమాని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అహంకారం ఎక్కువ అయినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటి నుంచి మనం నేర్చుకోవాలి. బిసిసిఐ ఐపీఎల్ ఇప్పటికైనా నేలకు దిగి రావాలి.. మీరు దేవుళ్ళు కాదు. దేశం కోసం ఆడండి. డబ్బు కోసం కాదు ఇది మైండ్ లో పెట్టుకోండి అంటూ ఒక అభిమాని మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.