కోహ్లీ వెంట పడ్డ పాక్ కెప్టెన్.. వదలట్లేదుగా?

praveen
టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విదేశాల్లో సైతం కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఘనత విరాట్ కోహ్లీకి సొంతం అయింది అని చెప్పాలి. కేవలం మైదానంలో తన ఆటతోనే కాదు ఏకంగా తన ఆటిట్యూడ్ తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ.   ఇక అటు ప్రపంచ క్రికెట్లో రికార్డుల రారాజుగా కూడా ఘనత సాధించాడు  ఇప్పటివరకు విరాట్ కోహ్లీ కొల్లగొట్టిన రికార్డులు ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి. అయితే ప్రపంచ ప్రపంచ క్రికెట్లో ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు సాధించిన రికార్డులను తక్కువ సమయంలోనే విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.



 ఇలా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి తన పేరును లిఖించుకున్నాడు. విరాట్ కోహ్లీ ఒకసారి బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగాడు అంటే చాలు పరుగుల వరద పారిస్తూ దూసుకుపోతున్నాడు విరాట్ కోహ్లీ. అయితే మొన్నటి వరకు రికార్డుల రారాజుగా కొనసాగిన కోహ్లీ వెంట ఇక ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ పడ్డాడు. ఏకంగా కోహ్లీ సాధించిన రికార్డులు అన్నింటిని కూడా బద్దలు కొడుతూ తన పేరు లిఖించుకున్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్లో కూడా భారీగా పరుగులు చేస్తూ దూసుకుపోతున్నాడు.


 ఈ క్రమంలోనే ముఖ్యంగా టి20 ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ వెంటపడ్డాడు పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్.  గత కొన్ని రోజుల నుంచి రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు. టి20 క్రికెట్ లో అత్యంత వేగంగా 1000 పరుగులను పూర్తి చేసుకున్న కెప్టెన్గా ఇటీవలే ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు బాబర్ ఆజమ్.  అయితే ఇంతకు మునుపు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 30 ఇన్నింగ్సులో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించగా కేవలం.. 26 ఇన్నింగ్స్ లోనే ఈ అరుదైన ఘనతను సాధించాడు బాబర్ ఆజమ్. గతంలో 56 ఇన్నింగ్సులో 2000 పరుగులను విరాట్ కోహ్లీ పూర్తి చేయగా ఇక పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ కేవలం యాభై రెండు ఇన్నింగ్స్ లోనే ఈ మైలురాయిని అందుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: