కోహ్లీ vs బాబర్ : ఊపులో ఉంది ఎవరు...?

M Manohar
ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. అయితే మూడేళ్ల విరామం తర్వాత ఈ రెండు జట్లు మళ్లీ పోటీపడుతున్నాయి. చివరగా రెండు జట్లూ 2019లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ వేదికగా పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనే దానిపైనే కాకుండా ఈ రెండు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్ లో కూడా ఎవరు రాణిస్తారు అనేదానిపై అభిమానుల లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ఇద్దరికీ ఆ ఆయా దేశాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే వీరిరువురిని ఎప్పుడు ఒకరితో ఒకరిని పోల్చుతూ లెక్కలు వేస్తుంటారు ఆటగాళ్ళు.
అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్ ఇద్దరు మంచి దూకుడు మీద ఉన్నారు. వన్డే టెస్ట్ టీ20 ఫార్మాట్లలో కోహ్లీ యావరేజ్ 50కి పైగా ఉంటే బాబర్ ఆజమ్ ది 40కి పైగా ఉంటుంది. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సమయం నుండి నిలకడైన బ్యాటర్ గా...  ఉంటే బాబర్ ఆజమ్ కూడా గత నాలుగేళ్లుగా రాణిస్తున్నాడు.
అయితే విరాట్ కోహ్లీ వన్డేలో 59.07 సగటుకు 12,129 పరుగులు చేయగా టెస్టుల్లో 51.08 సగటుతో 7,765 పరుగులు నమోదు చేశాడు. అలాగే ఈ మ్యాచ్ జరుగుతున్న టీ20 ఫార్మాట్లో కూడా 52.5 సగటుతో 3,159 పరుగులను సాధించాడు. ఇక బాబర్ ఆజమ్ కూడా పాకిస్తాన్ ఓపెనర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు. వన్డే ఫార్మాట్ లో ఇప్పటివరకు 56.92 సగటుతో 3,985 పరుగులు చేయగా... టెస్ట్ ఫార్మాట్లో 42.94 యావరేజ్ తో 2,326 పరుగులు చేశాడు. ఇక ఈ ప్రపంచ కప్ యొక్క టి20 ఫార్మెట్లో 46.29 తో ఇప్పటివరకు 2,204 పరుగులను నమోదు చేశాడు.
అయితే బాబర్ ఆజమ్ మీ ఏడాది టాప్ లో ఉన్నాడు అని చెప్పుకోవాల్సిందే. 2021 ఏడాదిలో 17 టి20 మ్యాచ్ లు ఆడిన బాబర్ 523 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కానీ విరాట్ కోహ్లీ ఈ ఏడాదిలో పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డారు అనేది అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: