
వైరల్ : వావ్.. సూపర్ మ్యాన్ ల క్యాచ్ పట్టాడు?
కాగా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. మొదటి రోజు నుంచే ఎంతో హోరాహోరీగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. అయితే టీ20 క్రికెట్ అంటే ఎప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే కొంత మంది ఆటగాళ్లు మైదానంలో ఊహించని విధంగా ఫీల్డింగ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. ఇక దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఇటీవలే మైదానంలో ఒక ఆటగాడు క్యాచ్ పట్టిన తీరు క్రికెట్ ప్రేక్షకులు అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది.
సూపర్ మాన్ లా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టాడు సదరు ఆటగాడు ఇటీవల టి20 వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో సఫారీ జట్టు ఆటగాడు మార్క్ రామ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది ఇక దీనిపై ఐసీసీ సైతం స్పందించింది. ఎయిర్ మార్క్ రామ్ అంటూ ఒక కామెంట్ కూడా పెట్టింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ కొట్టిన బంతిని బౌండరీ దగ్గరున్న మార్క్ రామ్ ఒక వైపు నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి గాల్లోకి డ్రైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. ఈ వీడియో చూసిన వారందరూ మార్క్ రామ్ ఒక సూపర్ మాన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.