కోహ్లీ కంటి రోహిత్ కే ఫ్యాన్స్ ఎక్కువ : పాక్ క్రికెటర్

praveen
రేపు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ హై వోల్టేజ్ మ్యాచును వీక్షించేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా సిద్ధమైపోయారు. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కి కొన్ని రోజుల ముందు నుంచే ఇరు దేశాల మాజీ ఆటగాళ్లు కూడా మ్యాచ్  ఆడుతున్న ఆటగాళ్ల బలాబలాలు బలహీనతల గురించి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.  ఇకపోతే రేపు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటివరకు గణాంకాలు చూసుకుంటే టీమిండియాది ఆధిపత్యం కొనసాగుతూ ఉండడం గమనార్హం.

 ఈ క్రమంలోనే ఈ సారి కూడా టీమిండియాను విజయం సాధిస్తుంది అని ప్రేక్షకులు భావిస్తున్నారు. అదే సమయంలో ఈ సారి విజయం సాధించి చరిత్ర తిరగరాస్తాం అంటూ పాకిస్థాన్ క్రికెటర్లు అంటున్నారు.   ఇక టి20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ కు జోడిగా విరాట్ కోహ్లీ ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అయితే ఇటీవలే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ గురించి పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ లో కూడా టీమిండియా క్రికెటర్లకు అభిమానులు ఉన్నారు అంటూ వ్యాఖ్యానించాడు షోయబ్ అక్తర్.

 టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట తో పాటు జస్ప్రిత్ బూమ్రా మహమ్మద్ షమీ బౌలింగ్ ను కూడా పాకిస్థాన్లో క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు అంటూ చెప్పుకొచ్చాడు. అటు పాకిస్థాన్లో కోహ్లీ కంటే రోహిత్ శర్మకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్. రోహిత్ శర్మ ను తాము ముద్దుగా ఇండియాక ఇంజమామ్ అని పిలుచుకుంటాము అంటూ తెలిపాడు. కాగా ఎప్పుడు టీమిండియా పై తన అక్కసును వెళ్లగక్కే షోయబ్ అక్తర్ మొదటిసారిగా పాజిటివ్ గా మాట్లాడటం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: