ధోని వచ్చేసాడు.. ఇక మొదలు పెట్టడమే?

praveen
మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలోనే ఇక ఇప్పటికే అన్ని జట్లు  యూఏఈ   చేరుకున్నాయి. క్వారంటైన్  పూర్తిచేసుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ఇక ఇటీవలే యూఏఈ లో ఐపీఎల్ పూర్తిచేసుకున్న భారత ఆటగాళ్లు ఇక అక్కడే టి20 వరల్డ్ కప్ జట్టుతో చేరిపోయారు. ఇక ప్రస్తుతం మైదానంలో తీవ్రంగానే కసరత్తులు ప్రారంభించారు.  ఇకపోతే టి20 వరల్డ్ కప్ తర్వాత తాను టి20 కెప్టెన్సీకి స్వస్తిపలక పోతున్నాను అంటూ విరాట్ కోహ్లీ ప్రకటించాడు.  దీంతో ఇక ఈ టి20 వరల్డ్ కప్ లో టీమిండియా పర్ఫామెన్స్ పై భారీగానే అంచనాలు పెరిగిపోతున్నాయి. కోహ్లీ ఈసారి తప్పకుండా  కప్ గెలిపిస్తాడు అని ఎంతో మంది అనుకుంటున్నారు.  అదే సమయంలో టి20 వరల్డ్ కప్ టీమ్ ఇండియా జట్టు మెంటార్ గా దోనిని నియమించడం మరింత అంచనాలను పెంచుతోంది.

 మొన్నటి వరకు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు సారథ్య బాధ్యతలను నిర్వహించాడు మహేంద్ర సింగ్ ధోనీ తన కెప్టెన్సీలో జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళాడు. వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ప్లే ఆప్ కి అర్హత సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇక 2021 ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచింది. ఇక టైటిల్ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ ఇక ఎప్పుడు టి20 వరల్డ్ కప్ టీమిండియా మెంటార్ గా జట్టుతో చేరిపోయాడు. ఇక ఇటీవలే బిసిసిఐ దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ధోనీ టీమిండియా మెంటార్ గా అటు జట్టుతో చేరిపోవడమే కాదు మైదానంలో కసరత్తులు కూడా మొదలు పెట్టాడు.

 కింగ్ కు సాదర స్వాగతం ఎంఎస్ ధోని కొత్త బాధ్యతలతో  టీమిండియాతో కలిసిపోయాడు అంటూ బీసీసీఐ ఒక పోస్టు పెట్టింది. ఇక ఈ పోస్టులో అటు హెడ్ కోచ్ రావిశాస్త్రి తోపాటు మహేంద్ర సింగ్ ధోనీ కూడా మైదానంలో కనిపిస్తున్నాడు. ఇక అక్కడ ఉన్న ఆటగాళ్ల కి కొన్ని సలహాలు కూడా ఇస్తున్నాడు. అయితే ధోనీ సారథ్యంలో టీమిండియా ఏకంగా రెండు వరల్డ్ కప్ గెలిచింది అన్న విషయం తెలిసిందే.  ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ కి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.  ఇలా భారత క్రికెట్ లో వరల్డ్ కప్ స్పెషలిస్ట్ గా ఉన్న ధోని అనుభవం టీమిండియాకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే బిసిసిఐ ధోనిని టీమిండియాకు మెంటార్ గా నియమించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: