నేడే రెండవ క్వాలిఫైయర్.. గెలిచేది ఎవరు?

praveen
మొన్నటివరకు క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పంచిన ఐపీఎల్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.  కేవలం ఐపీఎల్ లో మరో రెండు మ్యాచ్ లు మాత్రమే జరగబోతున్నాయి.  అయితే ఇప్పటికే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.  ఆ తర్వాత జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు విజయం సాధించగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పేలవ ప్రదర్శనతో ఇంటి బాట పట్టింది.

 కాగా నేడు రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారో అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.  నేడు రెండవ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్.. ఢిల్లీ కాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది.  రెండవ దశ ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు వరుసగా విజయాలతో ఎంతో దూకుడు మీద ఉంది.  అదే సమయంలో అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఇటీవలే మొదటి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో కాస్త తడబడింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఈసారి మాత్రం సత్తా చాటాలని భావిస్తోంది. నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

 కాగా రెండో క్వాలిఫయర్లో విజయం సాధించిన జట్టు అటు ఫైనల్కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో టైటిల్ కోసం పోరాడబోతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ పై ప్రేక్షకుల్లో కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయి.  దీంతో నేడు జరగబోయే మ్యాచ్ లో రిషబ్ పంత్ తనదైన వ్యూహాలను అమలు చేసి విజయం సాధించి ఫైనల్కు చేరుకుంటాడా లేదా ఇయాన్ మోర్గాన్ మరోసారి తన దూకుడు ప్రదర్శించి తన జట్టును ఫైనల్లోకి తీసుకుపోతాడా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: