డేవిడ్ వార్నర్ కి పట్టిన గతే.. సిఎస్కే క్రికెటర్కు రాబోతుందా?

praveen
ఎంత గొప్ప ఆటగాడు అయినా సరే ఒక్కసారి ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడ్డాడు అంటే వెనకా ముందు ఆలోచించకుండా పక్కన పెట్టేస్తుంటారు అనే విషయం తెలిసిందే. ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎన్నో సార్లు జరిగింది.  ఒక జట్టు తరఫున అద్భుతంగా రాణించిన ఆటగాడు ఇక ఆ తర్వాత మాత్రం విఫలం అయితే ఏకంగా జట్టు ఆటగాడిని వదులుకోవడానికి కూడా సిద్ధం అవుతుంది. ఇలా ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ ప్లేయర్లు వివిధ జట్లు మారుతూ వచ్చారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే క్రిస్ గేల్ కూడా ఇలాంటి అనుభవం ఎదుర్కొన్నాడు.

 అప్పట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాడు.  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా తనదైన రికార్డు సృష్టించాడు. కానీ ఒక్కసారి సరిగా ఆడకపోవడంతో ఏకంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్రాంచైజీ క్రిస్ గేల్ ను వేలంలో కి వదిలింది. అయితే ఇలా క్రిస్ గేల్ ను ఆర్సీబీ జట్టు వదిలేస్తుంది  అనేది మాత్రం ఎవరూ ఊహించలేదు. ఇటీవలే 2021లో డేవిడ్ వార్నర్ విషయంలో కూడా ఇదే జరిగింది  ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు డిఫెండింగ్ చాంపియన్ గా నిలవడానికి ఒకసారి ట్రోఫీ అందుకోవడానికి డేవిడ్ వార్నర్ కారణం అని చెప్పాలి.

 డేవిడ్ వార్నర్ జట్టులో కీలక ఆటగాడు ఒంటిచేత్తో ఎన్నోసార్లు జట్టుకు విజయాన్ని అందించాడు. అలాంటి ఆటగాడిని ఇటీవలే పక్కనపెట్టేసింది. కనీసం మైదానం వరకు కూడా రాకుండా హోటల్ గదికే పరిమితం చేసింది. ఇక ఇప్పుడు మరో ఆటగాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాబోతున్నదా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది  చెన్నై సూపర్ కింగ్స్ లో సురేష్ రైనా ఎంత కీలక ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సురేష్ రైనా 2021 సీజన్లో పేలవ ప్రదర్శన చేశాడు. కేవలం సీజన్ మొత్తంలో 160 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఇటీవల క్వాలిఫైయింగ్ మ్యాచ్లో ఏకంగా రాబిన్ ఉతప్ప సురేష్ రైనా స్థానంలో తుది జట్టులోకి తీసుకున్నారు.  రానున్న రోజుల్లో కూడా ఇదే కొనసాగే అవకాశముందని సురేష్ రైనాకి కూడా డేవిడ్ వార్నర్ పరిస్థితి వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: