అంపైర్ పై కే ఎల్ రాహుల్ చిందులు ?

Veldandi Saikiran
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో నిన్న జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఎంపైర్ పై చిందులు వేశారు. బ్యాటరీ క్లియర్ అవుట్ అని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. దీంతో ఆ ఫీల్డ్ ఎంపైర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్. ఈ ఘటన వివరాల్లోకి వెళితే... నిన్న జరిగిన నా మొదటి మ్యాచ్ లో... ఎనిమిదవ ఓవర్ వేశాడు పంజాబ్ కింగ్స్ బౌలర్ రవి బిష్ణోయి. అయితే ఈ సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్ లో ఉన్నాడు. 

రవి వేసిన బంతిని ఫిట్ చేసే ప్రయత్నం చేశాడు పడిక్కల్. ఈ నేపథ్యం లోనే... పడిక్కల్ చేతిని తాకి నేరుగా కీపర్ కె.ఎల్.రాహుల్ చేతిలో పడింది. అయితే ఫీలింగ్ ఎంపైర్ మాత్రం అవుట్ ఇవ్వలేదు. ఎంపైర్ నాటౌట్ ఇవ్వడంతో రివ్యూ కి వెళ్ళాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్. రిప్లై లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్  తాకినట్లు స్పష్టంగా అందరికీ కనిపించింది బంతి.

కానీ... థర్డ్ ఎంపైర్‌ కూడా బెనిఫిట్‌ ఆఫ్‌ డైట్‌ కింద... ఫీల్డ్‌ ఎంపైర్‌ కు ఆ నిర్ణయాన్ని వదిలేశాడు. దీంతో ఆ ఫీల్డ్‌ ఎంపైర్‌.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్ ను నాటౌట్‌ గా ప్రకటించాడు.  అంతేకాదు.. పంజాబ్‌ కింగ్స్‌ రివ్యూ కూడా వెస్ట్‌ అయిపోయింది.   దీంతో పంజాబ్‌ కింగ్స కెప్టెన్‌  కె ఎల్‌ రాహుల్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.  ఇదేక్కడి డెషిషన్‌... బంతి బ్యాట్స్‌ మెన్‌ కు తాకినా కూడా ఔట్‌ ఇవ్వారా ? ఇది చాలా దారుణమని.. ఆగ్రహం వ్యక్తం చేశాడు పంజాబ్‌ కింగ్స కెప్టెన్‌ కె ఎల్‌ రాహుల్‌. ఇక కెఎల్‌ రాహుల్‌ కు సపోర్ట్‌ గా నిలుస్తున్నారు ఫ్యాన్స్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: