గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా.. ఐపీఎల్ లో?

praveen
ఇటీవలే టోక్యో ఒలంపిక్స్ తర్వాత భారత్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నీరజ్ చోప్రా. అప్పటి వరకు ఎవ్వరికీ తెలియని ఈ క్రీడాకారుడు ఒలింపిక్స్ లో భారత్కు గోల్డ్మెడల్ సాధించి పెట్టడంతో ఒక్కసారిగా సూపర్ స్టార్ గా మారిపోయాడు. దేశవ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి ఇతని పేరు మార్మోగిపోతోంది. ఇక దేశంలోని ప్రతి ఒక్కరు ఇతని ప్రతిభకు మంత్ర ముగ్దులు అయిపోయి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో దశాబ్దాల నుంచి భారత్ కు కేవలం కల గానే మిగిలిపోయిందని  గోల్డ్ మెడల్ సాధించి ఇక త్రివర్ణ పతాకాన్ని టోక్యో ఒలంపిక్స్ లో రెపరెపలాడించాడు.

 దీంతో ఒక్కసారిగా 130 కోట్ల భారత ప్రజానీకానికి సూపర్ హీరోగా మారిపోయాడు.  ఇకపోతే నీరజ్ చోప్రా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే జూవేలిన్ త్రో  విభాగంలో టోక్యో ఒలింపిక్స్ భారత్ కి గోల్డ్మెడల్ సాధించి ఎన్నో వీళ్ళ నిరీక్షణకు తెర దించిన నీరజ్ చోప్రా ఇటీవలే బిసిసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో దర్శనం ఇచ్చాడు.  అదేంటి నీరజ్ చోప్రా ఐపీఎల్లో క్రికెట్ ఆడటం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.. ఈ ఫోటో చూస్తే మరింత ఆశ్చర్యపోతారు. అదేంటి నీరజ్ చోప్రా సడన్గా ఐపీఎల్లో ప్రత్యక్షం అయ్యాడు అని అనుకుంటారు.

 ఒకవేళ మీరు అలా అనుకున్నారు అంటే పొరబడినట్లే.. ఎందుకంటే మీరు ఈ ఫోటోలో చూస్తున్నది నీరజ్ చోప్రా ని కాదు రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ కార్తీక్ త్యాగిని. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో కార్తీక్ త్యాగీ అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టుకు విజయం అందించడంలో కీలక పాత్ర వహించాడు. చివరి ఓవర్ లో నాలుగు పరుగులు అవసరం కాగా కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చా
డు. అంతే కాదు రెండు వికెట్లు కూడా తీశాడు. దీంతో ఓడిపోతుంది అనుకున్న సమయంలో రాజస్థాన్ కు ఊహించని విజయాన్ని అందించాడు. అయితే కార్తీక్ త్యాగి అచ్చం నీరజ్ చోప్రా పోలికలను కలిగి ఉండటం గమనార్హం. దీంతో ఎంతో మంది నెటిజన్లు వీరిద్దరి ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. మరి కొంతమంది నీరజ్ చోప్రా కి కార్తీక్ ట్విన్ బ్రదర్ లా ఉన్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: