6 బాల్స్ 6 సిక్సులు.. ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన యువీ?

praveen
ధోని సారధ్య బాధ్యతలను చేపట్టిన తర్వాత మొట్టమొదటి సారి ఆడిన వరల్డ్ కప్..  ఈ క్రమంలోనే ధోనీ సారథ్యంలో అప్పటికే టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ ఎంతో దూకుడు మీద ఉంది. టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఎలా రాణిస్తుంది అనేదానిపై అటు భారత ప్రేక్షకులను ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస విజయాలను సాధిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది టీమిండియా. ఇక అప్పటి వరకు టీమిండియాకు అందని ద్రాక్షలా ఉన్న టి20 వరల్డ్ కప్ ను  గెలిచి ఇక భారత ప్రజలందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

 ఇక కెప్టెన్గా ధోనీ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అయితే ఈ టి 20 వరల్డ్ కప్ లో సునామి సృష్టించి ప్రతి మ్యాచ్లో కూడా టీమిండియా విజయంలో కీలక పాత్ర వహించింది యువరాజ్ సింగ్ అనే చెప్పాలి.  ముఖ్యంగా ఈ టి20 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం సంచలనం గానే మారిపోయింది. ఇక ఈ రికార్డు  ఇప్పటికీ కూడా పదిలంగానే ఉంది అని చెప్పాలి. ఇలా టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ జట్టుపై యువరాజ్ సృష్టించిన సునామీ ఇప్పటికీ భారత క్రికెట్ ప్రేక్షకులు మరిచిపోరు.

 అయితే 2007లో టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ఫై యువరాజ్ సృష్టించిన సిక్సర్ల సునామీకి 14 ఏళ్లు పూర్తి అవగా.. ఇటీవలే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ను  గుర్తు చేసుకుంటూ ఇటీవల యువరాజ్ సింగ్ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంగ్లాండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ నోటిదురుసు తో యువరాజ్ సింగ్ అని ఏదో అనడం.. ఇక ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో.. ఆ తర్వాత ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ పై చూపించడం..  ఇదంతా ఈ వీడియోలు ఎంతో వివరంగా చూపించాడు యువరాజ్ సింగ్. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన సమయంలో జరిగిన సంఘటనలు మొత్తం కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఒక వీడియో ని విడుదల చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: