రోహిత్ ఆటకు ఆసిస్ మహిళా క్రికెటర్ ఫిదా.. ఏమందో తెలుసా?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ.  ఎన్నో ఏళ్ల నుంచి ప్రస్తుతం తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తూ దూసుకుపోతున్నాడు.  ఒకప్పుడు మిడిలార్డర్లో ఆడిన రోహిత్ శర్మ ఇప్పుడు మాత్రం ఏకంగా ఓపెనర్గా బరిలోకి దిగి టీమిండియా ను ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.  ఒకసారి బరిలోకి దిగాడు అంటే చాలు పరుగుల వరద పారిస్తాడు. ప్రేక్షకులందరినీ ప్రతి సారి కూడా ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు రోహిత్ శర్మ.  ప్రస్తుతం టీమిండియా లో డబుల్ సెంచరీలు దీరుడిగా కొనసాగుతున్నాడు.

 అంతేకాదు భారీ సిక్సర్లు కొట్టడం లో కూడా అటు రోహిత్ శర్మ తనకు తానే సాటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఓపెనర్గా బరిలోకి దిగి స్కోరుబోర్డును పరుగులు పెట్టించి టీమిండియాకు భారీ గోర్లు చేసి పెట్టడం లో రోహిత్ శర్మ ఎప్పుడూ ముందు ఉంటాడు.  ఇక అటు రోహిత్ శర్మ లేకుండా బిసిసిఐ టీమిండియా జట్టును దాదాపుగా  ప్రకటించదు అని చెప్పాలి. అన్ని ఫార్మాట్లలో కూడా రోహిత్ శర్మ ఎంతో కీలకంగా మారిపోయాడు. ఇక విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను అందుకునేది అటు రోహిత్ శర్మ అనే విషయం తెలిసిందే.

 ఇకపోతే ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో కూడా ఎంతో అద్భుతంగా రాణిస్తూ టీమిండియాకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న రోహిత్ శర్మ తనకు ఎంతో స్ఫూర్తి ఇస్తున్నారు అంటూ ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎలిసా హేలీ చెప్పుకొచ్చారు. ఒకప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో విధ్వంసం సృష్టించి భారీ స్కోర్లు చేసే రోహిత్ శర్మ..  ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లో కూడా ఎంతో విజయవంతంగా రాణిస్తున్నారు అంటూ మహిళా క్రికెటర్ చెప్పుకొచ్చారు. రోహిత్ శర్మ నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతున్నారు అంటూ తెలిపారు అతనిలా ఆడాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది హీలి. కాగా ఈ నెల 20 నుంచి ఆసీస్ మహిళా జట్టు భారత పర్యటనకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: