సారథిగా తప్పుకుంటున్న కోహ్లీ.. ఇక రోహితే కెప్టెన్?

praveen
ఒకప్పుడు కెప్టెన్ అంటే క్రికెట్ లోని మూడు ఫార్మాట్లకు ఒక వ్యక్తి ఉండేవాడు. కానీ ఇప్పుడు మాత్రం అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కెప్టెన్సీ విషయంలో ఎంతో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే  ఒక్కో ఫార్మాట్ కి ఒక్కొక్కరిని కెప్టెన్గా నియమిస్తున్నాయి.  ఇప్పటివరకు ఇండియన్ క్రికెట్ లో మాత్రం అటు మూడు ఫార్మాట్లకి ఓకే ఆటగాడు కెప్టెన్గా కొనసాగుతున్నారు.  మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.

 అయితే గత కొన్ని రోజుల నుంచి కోహ్లీ కెప్టెన్సీ మార్పు పై తీవ్రస్థాయిలో డిమాండ్లు వస్తున్నాయి.  పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీ కెప్టెన్సీతో ఆకట్టుకోలేక పోతున్నాడు అని అందుకే కోహ్లీని సారథ్య బాధ్యతల నుంచి తప్పించి రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అని ఎన్నో రోజుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.  అయితే ఇలా ఒక్కో ఫార్మేట్ కి ఒక్కో కెప్టెన్ ని పెట్టడం వల్ల టీమిండియా ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపం ఏర్పడుతుంది అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.

 ఇకపోతే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇండియా కెప్టెన్గా విరాట్ కోహ్లీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక పరిమిత ఓవర్ల క్రికెట్కు టీమిండియా కెప్టెన్గా అటు రోహిత్ శర్మను బిసిసిఐ నియమించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో జరగబోయే టీ20 వరల్డ్ కప్  తర్వాత కెప్టెన్సీ బాధ్యతలను కోహ్లీ నుండి రోహిత్ కు అప్పగించాలని బిసిసిఐ వర్గాలు నుండి సమాచారం అందుతుంది. ఇక ఈ విషయాన్ని అటు విరాట్ కోహ్లీనే స్వయంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే బ్యాటింగ్ పై ఎక్కువగా దృష్టి పెట్టడానికి విరాట్ కోహ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: