సంచలనం.. ప్రపంచ నెంబర్.1నే ఓడించాడు?

praveen
ఇటీవలే యూఎస్ ఓపెన్ పురుషులు మహిళల సింగిల్స్ జరుగుతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన మహిళల ఓపెన్ సింగిల్స్ ఫైనల్ పోరులో ఏకంగా సంచలనం సృష్టిస్తూ 18 ఏళ్ల యువతి గ్రాండ్ స్లామ్  సొంతం చేసుకుంది. దీంతో ఏకంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అప్పుడు వరకు ఎక్కడా గొప్ప విజయాలను నమోదు చేయని ఎమ్మా  వేగంగా వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకొచ్చి.. ఫైనల్లో కూడా విజయం సాధించి ఇక తన కెరీర్ లో మొదటి సారి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను ముద్దాడింది. అంతే కాదు ఇలా గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న పిన్న వయస్కురాలు కూడా రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు అటు యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో కూడా సరికొత్త చరిత్రకు నాంది పలికాడు కొత్త ఆటగాడు.

 ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు గా కొనసాగుతున్నాడు నోవాక్ జకోవిచ్.  ఇప్పటివరకు ఎక్కువ గ్రాండ్ స్లామ్ లు గెలిచిన ఆటగాడిగా కూడా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు జకోవిచ్. ఇక టెన్నిస్ క్రీడలో తనకు తిరుగు లేదు అని నిరూపించారు. ఇప్పటివరకు ఎన్నో చారిత్రాత్మక విజయాలను కూడా నమోదు చేసి ఇక ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు అనే చెప్పాలి.  అలాంటి ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడిపై  గెలిచి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకోవడం అంటే అంత సులభమైన విషయం కాదు.  కానీ ఇక్కడ ఒక ఆటగాడు అదే చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అందరి చూపులు ఆకర్షించాడు.

 రష్యా స్టార్ టెన్నిస్ ప్లేయర్ మెద్వేదేవ్ తన కెరీర్ లో మొదటి సారి గ్రాండ్ స్లామ్ టైటిల్ ముద్దాడాడు. దీంతో ఇక ప్రపంచ నెంబర్ వన్ జకోవిచ్  ను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇటీవల జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో సెర్బియా యోధుడు ప్రపంచ నెంబర్ వన్ నోవాక్ జకోవిచ్ ఫై 6 -4, 6-4, 6-4 తేడాతో గెలిచి విజయకేతనం ఎగురవేశాడు. యూఎస్ ఓపెన్ 2019లో రన్నరప్గా నిలిచిన మెద్వదేవ్ ఇక ఇప్పుడు ఏకంగా గ్రాండ్ స్లామ్  గెలుచుకున్నాడు. తన కెరీర్లో మొదటి గ్రాండ్ స్లామ్  టైటిల్ ఇదే కావడం గమనార్హం. కాగా 25 ఏళ్ల మెద్వదేవ్ ప్రస్తుతం టెన్నిస్ ర్యాంకింగ్ లో టాప్ 2 కొనసాగుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: