టీమిండియా ఆటగాళ్లు నిద్రపోలేదు.. అది మానసిక దెబ్బ?

praveen
ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది.  ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది భారత జట్టు. ఈ క్రమంలోనే వరుసగా టెస్ట్ మ్యాచ్ లు  హోరాహోరీగా జరుగుతున్నాయి.  ఇప్పటివరకు ఏకంగా ఇంగ్లాండ్, టీం ఇండియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్లు ముగిసాయి. ఇక నాలుగో టెస్ట్ మ్యాచ్ లలో ఒక మ్యాచ్ డ్రాగా ముగియగా.. ఒక మ్యాచ్  ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది.. ఇక మరో రెండు మ్యాచ్ లల్లో టీమిండియా విజయం సాధించి ప్రస్తుతం ఒక పాయింట్ తో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.  ఇకపోతే ప్రస్తుతం ఐదవ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక ఐదవ టెస్ట్ మ్యాచ్ కోసం ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

 కానీ అంతలోనే కరోనా వైరస్ అందర్నీ అయోమయంలో పడేసింది. టీమిండియాలో కరోనా వైరస్ వెలుగులోకి రావడం సంచలనం గా మారిపోయింది. టీమిండియాలో హెడ్ కోచ్ రవిశాస్త్రి తో పాటు  బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్ కూడా  వైరస్ బారిన పడడం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో ఇక అయిదవ టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తారా లేదా అన్న దానిపై కూడా ఎంతో సందిగ్ధత నెలకొంది. ఇటీవలే టీమిండియా ఫిజియో యోగేష్ ఫార్మర్ కు కూడా కరోనా వైరస్ సోకటం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనిపై టీమిండియా   మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ప్రస్తుతం నాలుగో మ్యాచ్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లు ఐదో టెస్టు మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవడానికి ఎంతో కసి తో ఉన్నారు. ఇలాంటి సమయంలో టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరగబోయే 5వ టెస్టు సందిగ్దంలో పడడంతో ఎంతోమంది టీమిండియా ఆటగాళ్లు తెల్లవారుజాము వరకు నిద్రపోలేదు అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.  ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లతో తాను మాట్లాడానని బృందంలో కరోనా వైరస్ కేసులు రావడంతో ఆటగాళ్లు అందరూ ఎంతగానో ఆందోళన పడ్డారు అంటూ చెప్పుకొచ్చాడు. టీమిండియా అసిస్టెంట్ ఫిజియో యోగేష్ ఫర్మర్ కు కరోనా పాజిటివ్ రావడం హాట్ టాపిక్ గా మారిపోయింది. కోచ్ లు మొత్తం కూడా క్రికెటర్లకు అందుబాటులో లేకపోవడం మానసికంగా దెబ్బ తీసింది అంటూ చెప్పుకొచ్చారు దినేష్ కార్తీక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: