వైరల్ వీడియో : బూమ్రా యార్కర్ కి.. ప్రపంచం ఫిదా?

praveen
బూమ్ బూమ్ బూమ్రా..  ఇక ఈ ఫాస్ట్ బౌలర్ జట్టులో ఉన్నాడు అంటే టీమిండియాకు విజయం ఖాయం అని భారత క్రికెట్ ప్రేక్షకులు అందరిలో గట్టి నమ్మకం ఉంటుంది. ఎందుకంటే తన బౌలింగ్ ప్రతిభతో ఏ క్షణంలోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసి భారత్ వైపు తిప్పగల సత్తా జస్ప్రిత్ బూమ్రా సొంతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ప్రస్తుతం జట్టులో కీలక బౌలర్గా కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ఎన్నో సార్లు తన బౌలింగ్ తోనే టీమిండియాకు విజయం అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ప్రస్తుతం టీమిండియా లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా కూడా జస్ప్రిత్ బూమ్రా కొనసాగుతున్నారు.

 అలాంటి జస్ప్రిత్ బూమ్రా ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా పేలవ ప్రదర్శన చేయడం మాత్రం టీమిండియాకు మైనస్ గా మారిపోయింది అని చెప్పాలి. అటు కొత్తగా వచ్చిన వారు సైతం వరుసగా వికెట్లు పడుతూ ఉంటే అటు సీనియర్ బౌలర్ గా ఉన్న జస్ప్రిత్ బూమ్రా మాత్రం వికెట్లు పడగొట్టడం కాదు కదా ఎక్కువ పరుగులు ఇచ్చి టీమిండియాను ప్రమాదంలో పడేసాడు. దీంతో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. కానీ ఇటీవలే అనూహ్యంగా పుంజుకున్నాడు. ఇటీవలే ఏకంగా బ్యాట్ తో కూడా రాణించి అదరగొట్టిన జస్ప్రిత్ బూమ్రా ఇక నాలుగవ టెస్టులో తన బౌలింగ్ తో అద్భుతాలే సృష్టిస్తున్నాడు.

 సాధారణంగా జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ లో యార్కర్లు బాగా స్పెషల్ అన్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో యార్కర్లు సందిస్తూ బ్యాట్ మెన్ ని కన్ఫ్యూజ్ చేసి మరీ వికెట్ పడగోడుతూ ఉంటాడు. ఇక ఇటీవల జస్ప్రిత్ బూమ్రా వేసిన ఒక అద్భుతమైన యార్కర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో చూసినవారు బూమ్రా యార్కర్ కి ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. గుడ్ లెంత్ తో బూమ్రా వేసిన యార్కర్ బెయిర్ స్ట్రో  కాళ్ళ సందులోంచి దూసుకువెళ్లి వికెట్లు పడగొట్టింది. అయితే ఇటీవలే బూమ్రా విసిరిన  బంతి టెస్ట్ చరిత్రలోని అత్యుత్తమ డెలివరీ లలో ఒకటి అంటూ గార్డియన్ పత్రిక పేర్కొనడం గమనార్హం. అటు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కూడా బూమ్రా విసిరిన  బంతి అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: