కటిక పేదరికంలో మగ్గిపోతున్న క్రీడా దిగ్గజాలు..?

Suma Kallamadi
భారతీయ అథ్లెట్లు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నప్పుడు సాటి భారతీయులుగా మనం అందరం గర్వపడతాం. అలాగే సంతోషంగా వేడుకలు జరుపుకుంటాం. ఇక ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ లో  పతకాలు సాధిస్తే.. దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంటుంది. తాజాగా కూడా పారాలింపిక్స్ లో రెండు స్వర్ణ పతకాలను గెలుచుకుంది భారత్. దాంతో ఆ పతకాలు తెచ్చిపెట్టిన క్రీడాకారులను ప్రశంసల వర్షం తో భారతీయ పౌరలు ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఒక వెలుగు వెలిగిన క్రీడాకారుల దీనావస్థ అందరినీ కలిచివేస్తోంది. భారత దేశానికి గర్వకారణంగా నిలిచిన కొందరు అథ్లెట్లు ఇప్పుడు బతుకు భారమై సతమతమవుతున్నారు. అలాంటి వారిలో ముగ్గురు పరిస్థితి గురించి ఆర్టికల్ లో చూద్దాం.


1. నౌరి ముండు:


అండర్ 19 విభాగంలో జాతీయ హాకీ టీం తరఫున ఆడిన నౌరి ఇప్పుడు చిన్నపాటి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. నెలకు రూ.5 వేల జీతంతో ఆమె పని చేస్తుండగా తన కుటుంబ పోషణ బాగా భారమైపోయింది. హాకీ ఆటలో మంచి నైపుణ్యం ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో ఆమె శాశ్వతంగా దూరం అయిపోయింది.


2. సీతా సాహు:


సీతా సాహు ఏథెన్స్ స్పెషల్ ఒలింపిక్స్‌లో ఇండియన్ స్టార్‌ ప్లేయర్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఆమె ఇప్పుడు కుటుంబ పోషణ కోసం రోడ్‌సైడ్ లో ఫుడ్ విక్రయిస్తున్నట్లు సమాచారం. ఆమె 200 మీటర్ల రిలే రేస్, 1,600 మీటర్ల రేస్ ఈవెంట్లలో కాంస్య పతకం సాధించింది.


3. నిషా రాణి దత్:


నిషా రాణి దత్ అనే ప్రతిభావంతురాలి పరిస్థితి కూడా మరింత దయనీయంగా ఉంది. ఈమె దక్షిణాసియా ఛాంపియన్‌షిప్‌లో ఆర్చరీలో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఆమె ఆటను వదులుకోవాల్సి వచ్చింది. "ఆటను కొనసాగించడంతో పాటు నా పేద తల్లిదండ్రుల చేసుకోవడం నాకు భారమైంది. 2005లో, నేను టాటా ఆర్చరీ అకాడమీలో చేరాను. 2008 వరకు అక్కడే ఉన్నాను. నేను 500-600 వరకు నెలవారీ స్టైఫండ్ సంపాదించినప్పటికీ. అది సరిపోలేదు" అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: