న్యూజిలాండ్ మాజీ దిగ్గజ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ పక్షవాతం తో బాధపడుతున్నారు. ఆస్ట్రేలియా దేశం లో హర్ట్ సర్జరీ చేసే సమయం లో మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ కు ఉన్నట్టుండి... పక్ష వాతం వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా క్రికెటర్ క్రిస్ కెయిన్స్ కు హర్ట్ సర్జరీ చేసిన వైద్యులే స్పష్టం చేశారు. అత్యవసరంగా ఆయనకు గుండె ఆపరేషన్ చేసే సమయం లో... వెన్నముక లో కొంచెం స్ట్రోక్ వచ్చిందన్నారు వైద్యులు. ఈ నేపథ్యం లోనే ఆయన కాళ్లు చచ్చు పడిపోయాయని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు క్రిస్ కెయిన్స్ కు ఆరోగ్య పరిస్థితి కి సంబంధించిన హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు. క్రిస్ కెయిన్స్ కు ప్రస్తుతం రిహాబిలిటిషన్ చికిత్స అందిస్తున్నట్లు వారు చెప్పారు.
ఆరోటిక్ డిసెక్షన్ అంటే... గుండె సంబంధిత వ్యాధి తో క్రిస్ కెయిన్స్ బాధపడుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం క్రిస్ కెయిన్స్ వెంటిలేటర్ పైనే ఉన్నాడని.. ఆయన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని బులిటెన్ లో తెలిపారు వైద్యులు. ఆపరేషన్ సమయంలో పక్షవాతం రావడం అరుదైన ఘటన ల్లో చోటు చేసుకుంటాయని వారు చెప్పారు. క్రిస్ కెయిన్స్ పక్షవాతం నుంచి ఇప్పట్లో కోలు కోవడం చాలా కష్టమని... చాలా రోజులు ఆగాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు.
కాగా... 50 సంవత్సరాలు ఉన్న క్రిస్ కెయిన్స్... ఇంటర్నేషనల్ క్రికెట్ లో 1989 సంవత్సరం నుంచి 2006 వరకు న్యూజిలాండ్ టీం కు సేవలు అందించాడు. ఇక క్రిస్ కెయిన్స్ తన కెరీర్ లో న్యూజిలాండ్ జట్టు తరఫున ఏకంగా 62 టెస్టులు, 215 వన్డేలు ఆడి మంచి ఘనత ను సొంతం చేసుకున్నారు. క్రిస్ కెయిన్స్ న్యూజిలాండ్ జట్టుకు ఆల్ రౌండర్ గా సేవలు అందించాడు. తన 17 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో 9 వేలకు పైగా పరుగులు మరియు 400 లకు పైగా వికెట్లు తీసి... రికార్డు సృష్టించాడు. క్రిస్ కెయిన్స్ 2006 సంవత్సరం చివర లో న్యూజిలాండ్ జట్టుకు గుడ్ బై చెప్పాడు.