నాటింగ్‌ హామ్‌ టెస్ట్‌ ; విజయం దిశగా భారత్‌..?

Veldandi Saikiran
నాటింగ్ హమ్ వేదికగా టీమిండియా మరియు  ఇoగ్లాండ్ జట్ల మధ్య మొదటి టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో... మొదటి నుంచి వరుణుడు విలన్ గా మారాడు. మ్యాచ్ ప్రారంభమైన నుంచి... వర్షం ఆటంకం కలిగిస్తూనే ఉంది. ఇదే మ్యాచ్ వివరాల్లోకి వెళితే మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేసి... ఫస్ట్ ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ తరువాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా... మొదట తడబడింది. ఆ తరువాత ఓపెనర్ కేఎల్ రాహుల్ మరియు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆదుకోవడంతో... ఇంగ్లాండ్ పై కాస్త లీడింగ్ సంపాదించింది. 


279 పరుగులు చేసి టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ అయింది. ఈ మొదటి ఇన్నింగ్స్ లో కెప్టెన్ కోహ్లీ, రహానే, పూజారా పూర్తిగా విఫలం కాదా కేఎల్ రాహుల్ 84 పరుగులు మరియు రవీంద్ర జడేజా 56 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు.  దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి 95 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు... మొదటి ఇన్నింగ్స్ కంటే బాగా ఆడింది. రెండోఇన్నింగ్స్ లో మిడిలార్డర్ బ్యాట్స్మెన్ కెప్టెన్ రూట్ సెంచరీ చేయడంతో 303 పరుగులు చేసింది ఇంగ్లాండ్ టీం. కెప్టెన్ జాయ్ రూట్ 109 పరుగులు, వికెట్ కీపర్ బైర్ స్టో 30 పరుగులు, శ్యామ్ కరణ్ 32 పరుగులు చేసి పర్వాలేదనిపించారు.


ఇక అంతకు ముందు టీమిండియాకు మొదటి ఇన్నింగ్స్ లో ఆధిక్యం 95 పరుగులు ఉండటంతో చివరి లక్ష్యం 209 పరుగులుగా టార్గెట్ ఫిక్స్ అయింది. ఇక 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 52 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్ లో బాగా ఆడిన కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్ లో 26 పరుగులకే వెనుదిరిగాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 12 పరుగులు మరియు పుజారా 12 పరుగుల తో క్రేజ్ లో ఉన్నారు. నాటింగ్హామ్ టెస్టులో ఇక చివరి రోజు మిగిలి ఉంది. ఇంకా ఈ చివరి రోజున మరో 157 పరుగులు చేసే టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్ విజయం సాధించనుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: