కరోనాకే పంచ్ ఇచ్చి.. పతకం సాధించింది?

praveen
లవ్లీనా బోర్గోహైన్..ఈ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది  ఇటీవలే ఒలంపిక్స్ లో చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో భారత్కు అందని ద్రాక్షలా ఉన్న పథకాన్ని దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత సాధించి భారత గౌరవాన్ని నిలబెట్టింది. ఇక ఒలంపిక్స్ లో పథకాన్ని ముద్దాడిన రెండవ మహిళ గా కూడా మరో సరికొత్త చరిత్రకు నాంది పలికింది  ఇక బాక్సింగ్ విభాగంలో లవ్లీనాకు వచ్చింది కేవలం కాంస్య పథకం అయినప్పటికీ దానిని బంగారు పథకంగా భావిస్తున్నారు భారతీయులు. ఇక అరంగేట్రం చేసిన మొదటిసారే ఒలంపిక్స్ లో నిలబడి పథకాన్ని తీసుకు రావడం సంచలనంగా మారింది.



 69 కిలోల విభాగంలో తలపడిన లవ్లీనా కాంస్య పతకాన్ని సాధించింది. అంతకుముందు ఇక ప్రపంచ ఛాంపియన్షిప్లో 16సార్లు పథకాలను కొల్లగొట్టింది ఈ క్రీడాకారిణి. అయితే ఇటీవలే ఒలంపిక్స్ లో పథకం సాధించిన ఈ అథ్లెట్ అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందింది. ఇక ఆ గ్రామానికి కేవలం ఇప్పటివరకు మట్టిరోడ్డు మాత్రమే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాజధాని డిస్పూర్ కు ఏకంగా 320 కిలోమీటర్ల దూరంలో బరోముఖియ్ గ్రామం ఉంది. ఈ గ్రామం ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయ నాయకుల హామీలకు మాత్రమే పరిమితమవుతుంది. ఇక ఇటీవల ఇదే గ్రామం నుంచి వచ్చిన లవ్లీనా దేశానికి పథకం సాధించడంతో గ్రామ రూపురేఖలు మారిపోతున్నాయి.



 లవ్లీనా పతకం సాధించిన గంటల వ్యవధిలోనే ఆమె గ్రామానికి కాంక్రీట్ రోడ్డు కూడా పడింది. అయితే ప్రస్తుతం పతకం సాధించిన లవ్లీనా గత సంవత్సరం పంట పొలంలో తన తండ్రికి సహాయం చేస్తూ నాట్లు వేస్తూ కనిపించింది. అయితే ఇలా పంట పొలాల్లో పని చేయడం ఈ క్రీడాకారుడికి కొత్తేమీ కాదు. ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉంటుంది. అయితే ఒక మారుమూల గ్రామంలో జన్మించిన లవ్లీనా ఒలింపిక్స్ వరకు వెళ్లడానికి ఎంతగానో ఇబ్బందులు పడింది  గత ఏడాది ఒలింపిక్స్ కు అర్హత సాధించినప్పటికీ ఇక ఒలంపిక్స్ కరోనా కారణంగా వాయిదా పడింది  అదే సమయంలో లవ్లీనా బోర్గోహైన్ తల్లికి కిడ్నీ ఆపరేషన్ జరగడంతో తల్లిని చూడటానికి వెళ్లి   వైరస్ బారిన పడింది ఈ క్రీడాకారుని. ఆ సమయంలో తీవ్రంగా ఆరోగ్యం క్షీణించింది. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా కరోనా కి పంచ్ ఇచ్చి మరి మళ్లీ ఎంతో వేగంగా తీసుకొచ్చింది లవ్లీనా బోర్గోహైన్.  ఇలా లవ్లీనా ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: