
అతను టాప్ ఆర్డర్లో వద్దు.. మిడిల్ ఆర్డర్ బెటర్ : ఆకాశ్ చోప్రా
అయితే భారత్ శ్రీలంక మధ్య జూలై 13వ తేదీన వన్డే సిరీస్ మొదటి మ్యాచ్ జరగాల్సి ఉన్నప్పటికీ.. లంక జట్టు లో పలువురు ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడడంతో ఇక ఈ సిరీస్ వాయిదా వేస్తూ జూలై 18వ తేదీన ప్రారంభించేందుకు సిద్ధమైంది లంక క్రికెట్ బోర్డు. ఈ క్రమంలోనే నేడు ఇక శ్రీలంక భారత్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ వన్డే సిరీస్ లో భారత జట్టులోని ఆటగాళ్లు ఏ స్థానంలో ఆడితే బాగుంటుంది అన్న దానిపై ప్రస్తుతం ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు లో ఉన్న మనీష్ పాండే బ్యాటింగ్ స్థానంపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా అయితే మనీష్ పాండే టాప్ ఆర్డర్లో ఆడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే శ్రీలంక వన్డే సిరీస్లో టీమ్ ఇండియా మనీష్ పాండే ని ఎంపిక చేస్తే టాప్ ఆర్డర్లో కాకుండా మిడిలార్డర్లో ఆడిస్తే బాగుంటుంది అని ఆకాష్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశారు. మనీష్ పాండే కి మిడిల్ ఆర్డర్లో అవకాశం ఇవ్వాలి.. టాప్ 3 లో అతని బ్యాటింగ్ పంపించకూడదు అంటూ చెప్పుకొచ్చాడు. అతడిని 5వ స్థానంలో మిడిల్ ఆర్డర్లో ఆడించి ఇక ఆ తర్వాత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ని ఆరవ స్థానంలో ఆడిస్తే ఎంతో బెటర్.. మంచి ఫలితాలను రాబట్టవచ్చు అంటూ ఆకాష్ చోప్రా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.