కోహ్లీ కెప్టెన్సీపై సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు?
ఇక ఇటీవలే జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలుస్తుంది అని అనుకున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్లో అందరికీ హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగింది భారత్. కానీ ఊహించని విధంగా పేలవ ప్రదర్శన చేసి నిరాశపరిచింది. దీంతో కోహ్లీ కెప్టెన్సీపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడం మొదలైంది. ఇప్పటివరకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ లో కూడా కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. అదే సమయంలో భారత జట్టు కూడా ఒక్క ఐసిసి ఈవెంట్ లో కూడా గెలవలేక పోయింది. దీంతో కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్స్ తెరపైకి వచ్చాయ్.
ఇలాంటి సమయంలో కోహ్లీ కెప్టెన్సీ పై భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ నెంబర్వన్ బ్యాట్స్మన్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అతని బ్యాటింగ్ రికార్డుల ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి అంటూ సురేష్ రైనా తెలిపాడు.అయితే అతను ఇప్పటికే ఎన్నో విజయాలను సాధించాడు.అతని రికార్డులను అందుకోవడం కూడా అంత సులభమేమీ కాదు అయితే ప్రస్తుతం అందరూ ఐసీసీ ట్రోఫీలు గురించి మాట్లాడుతున్నారు. ఇకపోతే ఇప్పటివరకు విరాట్ కోహ్లీ అసలు ఐపీఎల్ టైటిలే గెలవలేదు. నాకు తెలిసి ఐసీసీ ట్రోఫీ గెలవాలంటే అతనికి ఇంకా సమయం కావాల్సి ఉంది అంటూ సురేష్ రైనా చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి.