ఐపీఎల్ తో పిచ్ లు దెబ్బతింటాయి : మార్క్ బౌచర్

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐపీఎల్ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఐపీఎల్ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులందరికీ మజా డబుల్ అవుతూ ఉంటుంది. అయితే గత ఏడాది కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతుంది అనుకున్న ఐపీఎల్  యూఏఈ వేదికగా నిర్వహించింది  బిసిసిఐ. ఆటగాళ్లు అందరినీ బయో పద్ధతిలో ఉంచి ఇక ఎలాంటి ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ నిర్వహించింది. అయితే ఈ ఏడాది అనుకున్న సమయానికి వేసవిలో ఐపీఎల్ నిర్వహించాలని అనుకుంది. ఈ క్రమంలోనే పక్క ప్లాన్ వేసింది బిసిసిఐ.  ఇక భారత్లో కఠిన నిబంధనల మధ్య ఐపిఎల్ స్టార్ట్ చేసింది బీసీసీఐ.

 కొన్నాళ్ళ వరకు ఐపీఎల్ సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాత బయో బబుల్ లో ఉన్న ఆటగాళ్లు వరుసగా  వైరస్ బారిన పడటంతో చివరికి ఎంతో రంజుగా సాగుతున్న ఐపీఎల్ ని కాస్త వాయిదా వేసే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఇక మరోసారి యూఏఈ వేదికగా నిర్వహించిన ఐపీఎల్ మిగతా మ్యాచ్లు నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూలు కూడా విడుదల చేసింది. అయితే అటు ఐపీఎల్ ముగియగానే కొన్ని రోజుల్లోనే టి20 వరల్డ్ కప్ కూడా యూఏఈ వేదికగా జరగబోతుంది అంటూ ఇటీవల ఐసీసీ ప్రకటించింది. అయితే తాజాగా ఐపీఎల్ యూఏఈ వేదికగా జరగడంపై దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 టి20 వరల్డ్ కప్ కు ముందు ఐపీఎల్ ను యూఏఈ వేదికగా నిర్వహించడం కారణంగా అక్కడ  ఉన్న పిచ్ లు దెబ్బతినే అవకాశం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు మార్క్ బౌచర్ . అయితే పిచ్ లు దెబ్బతినడం అటు స్పిన్నర్లకు ఎంతగానో కలిసి వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. కానీ బ్యాట్స్మెన్ లకు మాత్రం పరుగులు రాబట్టడం ఎంతో కష్టతరంగా మారుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.  ఈ క్రమంలోనే అటు టి20 వరల్డ్ కప్ లో తక్కువ స్కోరు నమోదు అయ్యే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు . టి20 వరల్డ్ కప్ కంటే ముందు జరగబోయే ఐపీఎల్ లో మ్యాచ్ లను బట్టి ఇక వరల్డ్ కప్ లో అక్కడ పిచ్ లు ఎలా స్పందిస్థాయి  అన్నది అర్థం చేసుకోవచ్చు అంటూ దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: