వరల్డ్ కప్ విషయంలో అనుకున్నదే జరిగింది?

praveen
సాధారణంగా ఐసీసీ టోర్నీలు అంటే చాలు అటు క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. తమ అభిమాన జట్టు విశ్వవిజేతగా నిలవాలని మొదటి నుంచి ఎంతో ప్రోత్సాహం అందిస్తూ వుంటారు.  అప్పుడైతే ప్రేక్షకులందరూ ఇక స్టేడియం కు వెళ్లి తమ అభిమాన జట్టుకు మద్దతు తెలుపుతూ ఉండేవారు. అయితే ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదు కాబట్టి.. కేవలం టీవీల ముందు కూర్చుని తమ అభిమాన జట్టు గెలవాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే...  గత ఏడాది టి20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది.


 కానీ కరోనా వైరస్ కారణంగా ఊహించని పరిస్థితులు వచ్చాయి.  దీంతో గత ఏడాది జరగాల్సిన టి20 వరల్డ్ కప్ కాస్త వాయిదా పడుతూ వచ్చింది.  అయితే టి20 వరల్డ్ కప్ భారత్ వేదికగా జరగాల్సి ఉంది. భారత్ కూడా వరల్డ్ కప్ కి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమైంది. కానీ ఊహించని పరిణామాలతో వరల్డ్ కప్ వాయిదాపడింది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ ఎప్పుడు నిర్వహిస్తారు అనే దానిపై కూడా సరైన స్పష్టత లేకుండా పోయింది. కాగా గత కొన్ని రోజుల నుంచి వరల్డ్ కప్ గురించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.  మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ నిర్వహించబోతున్నారని.. కానీ వేదిక మాత్రం మారబోతుంది అని గత కొన్ని రోజులుగా ఎంతో ప్రచారం జరిగింది.



 ఇప్పుడు ఈ ప్రచారమే నిజమైంది. భారత వేదికగా జరగాల్సిన టి20 వరల్డ్ కప్ ప్రస్తుతం వేదిక మారినట్లు తెలుస్తోంది  ప్రస్తుతం భారత్లో వరల్డ్ కప్ నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో ఇక యూఏఈ వేదికగా వరల్డ్ కప్ నిర్వహించాలని భావిస్తున్నట్లు   బీసీసీఐ తెలిపింది. అయితే యూఏఈ వేదికగా నిర్వహించినప్పటికీ అన్ని రైట్స్ మాత్రం భారత్కే ఉంటాయని  ఇటీవలే గంగూలి తెలిపారు. అక్టోబర్ నవంబర్ నెలల్లో ఈ సిరీస్ ఉండే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే ఇప్పటికే బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపిఎల్ లో వాయిదాపడిన మ్యాచ్ లను యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత వరల్డ్ కప్ ప్రారంభం అయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: