WTC final : అసలు రిజర్వుడ్ డే అంటే ఏంటి?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.  ఇక కనీవినీ ఎరుగని రీతిలో క్రికెట్ మజా అందిస్తుంది అని అనుకున్నారు. కానీ అంతలో ప్రేక్షకుల ఆశలపై వరుణదేవుడు నీళ్లు చల్లాడు. దీంతో అసలు వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై కూడా ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఇక ఎట్టకేలకు  ఫైనల్ మ్యాచ్ రిజర్వుడు డే కి చేరుకుంది.  దీంతో ఇక చివరి ఫలితం రిజర్వు డే రోజు వెల్లడి కానుంది.

 అయితే మొదటి రోజు, నాలుగవ రోజు ఒక్క బంతి కూడా పడకుండానే పూర్తిగా మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో ఒక్కరికి ప్రేక్షకులు ఎంతగానో నిరాశ చెందారు. అయితే ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ గెలవాలని ఎంతో ఆశగా ఉన్న రెండు జట్ల కి కూడా వరుణుడు పగబట్టినట్లు వ్యవహరించడంతో షాక్ తగిలింది  ఇక ఫలితంగా ఆరో రోజైన నేడు రిజర్వుడు డే రోజున అసలుసిసలైన ఫలితం తేలనుంది.  మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుండగా నేడు ఏ జట్టు గెలవబోతుంది అనేదానిపై ఎంతో ఆసక్తి నెలకొంది.

 అయితే సాధారణంగా మ్యాచ్ జరగడం చాలా మంది చూసే ఉంటారు. కానీ రిజర్వుడు డే రోజున చాలా తక్కువగా మ్యాచ్ లు జరుగుతుంటాయి. ఇంతకీ రిజర్వుడు అంటే ఏమిటంటే.. రిజర్వుడు డే రోజు  మూడు వందల ముప్పై నిమిషాల పాటు ఆట జరుగుతుంది. ప్రతి జట్టు 83 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఏది ముందు అయితే అదే అమలవుతుంది. అయితే రిజర్వ్ ఉండే సమయం ముగిసే సరికి ఇరుజట్లు సమానమైన స్కోరుతో టై అయితే.. ఇక రెండు జట్లను కూడా విజేతలుగా ప్రకటిస్తారు. లేదా ఆధిక్యంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. మరి నేడు ఎవరు విజేతగా నిలవబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: