శవాలతో క్యూ కట్టడం చూశాను : వార్నర్
ముఖ్యంగా భారత హీరో లకు సంబంధించిన సినిమాలోని పాటల పై డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేసి అదరగొట్టాడు. భారతీయులందరికీ ఎంతగానో దగ్గరయ్యాడు డేవిడ్ వార్నర్. అంతేకాదు భారతదేశంలోని సమస్యల గురించి.. పలు విషయాల గురించి కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటాడు. ఇక ఇటీవల భారత్ లో కరోనా ప్రభావం ఏ రేంజిలో ఉంది అనే విషయాన్ని గురించి.. ఐపీఎల్ వాయిదా పడటం గురించి డేవిడ్ వార్నర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో నెలకొన్న పరిస్థితులు చూసి ఏకంగా భయాందోళనకు గురయ్యా అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు.
భారత్‌లో కరుణ సెకండ్ వేవ్ ఎంతో భయానకంగా అనిపించింది అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఆక్సిజన్ కోసం ప్రజలందరూ అల్లాడిపోయిన పరిస్థితులను తాను కళ్ళారా చూశాను అంటూ తెలిపాడు డేవిడ్ వార్నర్. అంతేకాకుండా వైరస్ బారినపడి మృతి చెందినవారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు శవాలతో వారి కుటుంబీకులు క్యూలైన్లో వేచివున్న సంఘటనలు తనను ఎంతగానో కకలిచి వేసాయ్ అంటూ డేవిడ్ వార్నర్ తెలిపాడు. గ్రౌండ్ నుంచి హోటల్‌కు వచ్చే దారిలో తాను వీటన్నింటినీ గమనించా అంటూ తెలిపాడు డేవిడ్ వార్నర్. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ వాయిదా వేసి బిసిసిఐ సరైన నిర్ణయం తీసుకుంది అని తెలిపాడు.