కరోనా ఎఫెక్ట్: వీధిన పడ్డ వారి బతుకులు..?

Suma Kallamadi
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా వల్ల చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. పూట గడవక కొందరు, అప్పులపాలై మరికొందరు, అనారోగ్యం పాలై ఇంకొందరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా వల్ల చాలా కంపెనీలు మూతపడ్డాయి. ఆర్థిక సమస్యలు తలెత్తడం వల్ల అనేక సంస్థలు మూసివేయాల్సి వచ్చింది. ఇటువంటి తరుణంలో ఉద్యోగాలు ఊడి చాలా మంది రోడ్డున పడ్డారు. ఉపాధ్యాయులు రోడ్డు మీద వ్యాపారాలు చేసుకునే స్థితి నెలకొంది. అన్నీ రంగాల్లోనూ ఆర్థిక స్థితి దారుణంగా దిగజారిపోయింది. గత ఏడాది మార్చి నుంచి కరోనావైరస్ వణికిస్తూనే ఉంది. క్రీడా రంగాన్ని కూడా కరోనా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఉత్తర ప్రదేశ్‌లో చాలా మంది కోచ్‌ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కరోనా వల్ల ఆటగాళ్ళు ఆటను ఆపాల్సి వచ్చింది. ఆటకు దూరంగా ఉంటుండంతో శిక్షకులు ఉపాధి లేక  వీధిల్లో పడ్డారు. చాలా మంది కోచ్‌లు దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. లక్నోలోని నీల్‌మాథకు చెందిన కోచ్ సంజీవ్ కుమార్ గుప్తా కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి వడ్రంగి పని చేస్తూ జీవిస్తున్నారు.

రోజుకు రూ .300 సంపాదిస్తూ దుర్భరమైన జీవితాన్ని సాగిస్తున్నాడు. అతను ఐదుసార్లు పతక విజేతగా నిలవడంతో పాటు ఎన్‌ఐఎస్ పాటియాలా నుండి ఫెన్సింగ్‌లో డిప్లొమా చదివారు. అతని 12 ఏళ్ల కుమార్తె ఖ్యతి గుప్తా కూడా ఫెన్సింగ్‌లో జాతీయ బంగారు పతక విజేత. అతని దుర్భర జీవితాన్ని చూసిన యుపి మాజీ గవర్నర్ రామ్ నాయక్ అతన్ని ఆదుకోవాలని యుపి సిఎంకు లేఖ రాశారు. ఎన్ ఆర్చరీ కోచ్ మహేంద్ర ప్రతాప్ సింగ్ (44) ఉపాధి లేక సమోసాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతను జాతీయ, అంతర్జాతీయంగా పోటిల్లో పాల్గోనే యువ ఆర్చర్లను శిక్షణ ఇచ్చి పోత్సాహించాడు. ఇప్పడు ఉపాధి లేక సమోసాలు, వడలు,స్నాక్స్ విక్రయిస్తు కుంటుంబాన్ని పోషిస్తున్నారు.  కోల్‌కతాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఐఎస్) నుండి ఆర్చరీలో డిప్లొమా పొందారు. జాతీయ స్థాయి పోటిల్లో 8 సంవత్సరాలు యుపి నుంచి ప్రాతినిధ్యం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: