ప్రపంచంలో వివక్ష నుంచి విజేత గా మారిన.. లెస్బియన్ క్రీడాకారిణులు వీరే..?
అమెరికాకు చెందిన ఫుల్ బాల్ ప్లేయర్ మేగన్ రపీనో తన సెక్సువాలిటీ గురించి ఒక ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానొక లెస్బియన్ అని చెప్పింది..ఎలేనా డెల్లే డోనే యూఎస్ బాస్కట్‌బాల్ ప్లేయర్. ఒలంపిక్స్‌తో తన దేశం తరపున ప్రాతినిథ్యం వహించింది. తాను అమండా అనే యువతితో ప్రేమలో పడ్డానని ఆమెతో ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయిందని మీడియాకు వెల్లడించింది..సారా విలన్‌కోర్ట్ క్యూబెక్ దేశానికి చెందిన ఐస్ హాకీ క్రీడాకారిణి తను లెస్బియన్ అని సియాటిల్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.
అమెరికా స్టార్ బాస్కెట్ బాల్ ప్లేయర్ బ్రిట్నీ గ్రినర్. కళాశాలలో చదివే సమయంలోనే నేషనల్ చాంపియన్‌షిప్ గెలచుకున్నది. అయితే తానొ క లెస్బియన్ అని చెప్పగానే వివక్షను ఎదుర్కున్నది. కైట్లిన్ కహో అమెరికా ఐస్ హాకీ జట్టులో డిఫెన్స్ ప్లేయర్.2010 వింటర్ ఒలంపిక్స్‌లో వెండి పతాకం గెలుచుకున్న జట్టులో సభ్యురాలు. చిన్నతనంలోనే అనేక హాకీ లీగ్స్ ఆడింది. అయితే తాను ఒక లెస్బియన్ అని చెప్పుకోవడానికి ఏనాడూ వెనుకడుగు వేయలేదు. మార్టీనా నవ్రతిలోవా తర్వాత లెస్బియన్ ప్రకటించుకున్న ఏకైక టెన్నిస్ క్రీడాకారిణి ఈమే. తన పర్సనల్ లైఫ్ గురించి అనేక రూమర్లు వస్తుండటంతో ఒక సారి తన సహచరిని వెంటబెట్టుకొని మీడియా మీట్ నిర్వహించింది.