అలా ఎలా కుదురుతుంది.. అతని తప్పించే సమస్య లేదు : కోహ్లీ

frame అలా ఎలా కుదురుతుంది.. అతని తప్పించే సమస్య లేదు : కోహ్లీ

praveen
మొన్నటి వరకు భారత క్రికెట్లో కె.ఎల్.రాహుల్ అంటే చాలు స్కోర్ బోర్డు సైతం వణికి పోతూ ఉండేది అన్న విషయం తెలిసిందే. అంతలా ఒక్కసారి మైదానంలోకి దిగాడు అంటే చాలు పరుగుల వరద పారిస్తూ ఉండే వాడు. తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నాడు. గత రెండేళ్ల నుంచి కేఎల్ రాహుల్ గణాంకాలు చూస్తే దిగ్గజ క్రికెటర్ లూ సైతం ఆశ్చర్య పోయే విధంగా ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో కూడా జట్టు మొత్తం కష్టాల్లో పడిపోయి ఓడిపోయే పరిస్థితి లో ఉన్నప్పటికీ కె.ఎల్.రాహుల్ ఒంటిచేత్తో పోరాటం చేసి ఇక విజయం కోసం అద్భుతమైన పోరాటం చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే.



 అయితే ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన కె.ఎల్.రాహుల్ ఆ తర్వాత మాత్రం తన ఫామ్ను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం తెలిసిందే.  ఇక ఇటీవల భారత్ ఇంగ్లాండ్ మధ్య టి20 సిరీస్ జరుగుతూ ఉంది. ఇక ఈ టి 20 సిరీస్ లో భాగంగా ఓపెనర్ గా రంగం లోకి దిగుతున్న కె.ఎల్.రాహుల్ పేలవ ప్రదర్శన చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు మొన్నటివరకు అద్భుతంగా రాణించి కెరీర్లోనే అత్యుత్తమ పాములు కొనసాగిన కేఎల్ రాహుల్ ఒక్కసారిగా పేలవ ప్రదర్శన చేయడంతో అభిమానులు అందరూ ఆశ్చర్యపోయారు.



  వరుసగా మూడు నాలుగు సార్లు ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు కె.ఎల్.రాహుల్. ఈ నేపథ్యంలోనే కె.ఎల్.రాహుల్ జట్టు నుంచి తప్పించాలి అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల కేఎల్ రాహుల్ ను జట్టు నుంచి తప్పించడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్ ఒక ఛాంపియన్ ప్లేయర్..  గత రెండు మూడేళ్ల నుంచి అతని గణాంకాలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఏ క్రికెటర్ కి కూడా అలాంటి గణాంకాలు సాధ్యం కాదు. అతనిని  జట్టు నుంచి తప్పించే  ఆలోచన లేదు అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ తోపాటు కె.ఎల్.రాహుల్ తమ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: