అతనికి అవకాశం ఇచ్చి.. కోహ్లీ నువ్ రెస్ట్ తీసుకోవచ్చుగా : సెహ్వాగ్
కానీ అభిమానుల ఊహకందని విధంగా టీమిండియా ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేసి నిరాశపరిచారు అన్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా ఆటగాళ్లలో ప్రస్తుతం మంచి ఫాంలో కొనసాగుతున్న కె.ఎల్.రాహుల్.. విరాట్ కోహ్లీ లూ సైతం పరుగులు ఏమీ చేయకుండానే పెవిలియన్ చేరడం అందరిని నిరాశపరిచింది. అయితే భారత జట్టులో కీలక ఆటగాడు అయినా రోహిత్ శర్మ కు రెస్ట్ ఇస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన టీం ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఎప్పుడు తనదైన శైలిలో స్పందించే వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి కోహ్లీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు టాప్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ కు విశ్రాంతి ఇచ్చి కోహ్లీ ఏం ప్రయోగం చేయాలి అనుకుంటున్నాడు.. మంచి ఫాంలో కొనసాగుతున్న వాళ్లని పక్కన పెట్టడం లో కోహ్లీ అంతర్యం ఏమిటి..అదేదో తానే విశ్రాంతి తీసుకొని మిగతా ఆటగాళ్లకు అవకాశం ఇవ్వొచ్చు కదా.. జట్టులో ముగ్గురు స్పిన్నర్లు అవసరమా అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ఘాటుగా కోహ్లి పై స్పందిస్తూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇక ప్రస్తుతం మొదటి మ్యాచ్లో ఒక్క పరుగు కూడా చేయకుండానే వికెట్ కోల్పోయిన కోహ్లీ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.