అతను నాకంటే బాగా ఆడుతున్నాడు.. కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు..?
అయితే వాషింగ్టన్ సుందర్ ప్రదర్శనపై అటు మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. వాషింగ్టన్ సుందర్ ఇలాంటి ఫామ్ లోనే కొనసాగితే రానున్న రోజుల్లో ఒక మంచి క్రికెటర్ గా ఎదిగే అవకాశం ఉంది అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా వాషింగ్టన్ సుందర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. వాషింగ్టన్ సుందర్ ప్రతిభ ఎంతో అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించాడు టీమిండియా హెడ్ రవిశాస్త్రి. కొన్ని కొన్ని సార్లు వాషింగ్టన్ సుందర్ తనకన్నా సహజ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు అని భావన కలుగుతూ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.
వాషింగ్టన్ సుందర్ భారత జట్టులో టాప్ 4 లో బ్యాటింగ్ చేయాలి అని ఆకాంక్షిస్తున్నాను అంటూ టీమిండియా హెడ్ కోచ్ రావిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ పై కూడా దృష్టి పెడితే రానున్న రోజుల్లో.. మంచి భవిష్యత్తు ఉంటుందని మంచి బౌలర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చారు. గతంలో తాను భారత జట్టులో ఆడుతున్న సమయంలో కూడా తన స్థానం ఆరో స్థానంలో ఉండేదని... ఇక ఇప్పుడు అదే స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న వాషింగ్టన్ సుందర్ తన కంటే ఎంతో అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు అనిభావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు హెడ్ కోచ్ రావిశాస్త్రి.