ఆయనతో ఎలాంటి విభేదాలు లేవు.. పీవీ సింధు కీలక వ్యాఖ్యలు..?

praveen
భారత బ్యాడ్మింటన్ కెరటం.. భారత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం గా వ్యాపింప  చేసిన గొప్ప అథ్లెట్ పీవీ సింధు.. బ్యాట్మెంటన్ బాడ్మింటన్ లో ప్రస్తుతం ప్రపంచ స్థాయి లోనే గొప్ప ఆటగాళ్లలో నెంబర్వన్ స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్లో భారత్ కి పథకం తీసుకు వచ్చిన ఏకైక మహిళగా పీవీ సింధు రికార్డు సృష్టించింది. అంతే కాదు బ్యాడ్మింటన్లో ఎన్నో సరికొత్త రికార్డును నెలకొల్పింది పీవీ సింధు. ఉవ్వెత్తున ఎగసిన కెరటం లో పీవీ సింధు బ్యాట్మెంటన్ లో ప్రపంచం మొత్తాన్ని  ఒక్కసారిగా ఆకర్షించింది. ప్రస్తుతం భారత ఆశాజ్యోతి గా పీవీ సింధు వెలుగొందుతున్న విషయం తెలిసిందే.

 ఇక వరుసగా బ్యాట్మెంటన్ టైటిల్ను గెలుచుకుంటు  ఎంతో విజయవంతం గా ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది  పీవీ సింధు అంతేకాదు ఎంతో మంది మహిళల కు ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా  తెలుగు ప్రజలకైతే గర్వకారణంగా నిలిచింది పీవీ సింధు. ఒక తెలుగు యువతి ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్లో రాణించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం గా మారిపోయింది. అయితే కరోనా  వైరస్ కారణంగా ప్రస్తుతం అన్నిరకాల క్రీడలు నిలిచిపోయిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే బ్యాడ్మింటన్ క్రీడా కూడా  నిలిచిపోయింది.

 ప్రస్తుతం క్రికెట్ సహా మరికొన్ని రకాల క్రీడలు ప్రారంభమైన నేపథ్యంలో బ్యాట్మెంటన్ కూడా మరికొన్ని రోజుల్లో ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా ఇటీవలే పీవీ సింధు ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టింది. బ్యాట్మెంటన్ కోర్టు లో సత్తా  చాటేందుకు  తాను సిద్ధంగా ఉన్నట్లు పి.వి.సింధు తెలిపింది. ఆట తో పాటు ఆరోగ్యపరంగా సిద్ధంగా ఉన్నాను అంటూ తెలిపింది. 2021లో ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ తో మళ్లీ కోర్టు లోకి అడుగుపెట్టబోతున్నా అంటూ తెలిపింది పీవీ సింధు. అంతేకాకుండా కోచ్ గోపీచంద్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవు అంటూ స్పష్టం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: