ఐపీఎల్ : అతను గొప్ప ఆల్రౌండర్ అవుతాడు..
అయితే గత కొన్నేళ్ల నుంచి మంచి గుర్తింపు సంపాదించుకున్న అప్పటికీ భారత జట్టులో చాలా తక్కువగా స్థానం సంపాదించుకున్న వాషింగ్టన్ సుందర్ కూడా ఈ ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడిన వాషింగ్టన్ సుందర్.. ప్రతి మ్యాచ్లో కూడా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తం మ్యాచ్ లలో అనుభవాన్ని ఉపయోగించాడు వాషింగ్టన్ సుందర్. అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.
ఇక ఇటీవల వాషింగ్టన్ సుందర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోచ్ కటిచ్. రాబోయే రోజుల్లో ఒక మంచి ఆల్రౌండర్ గా మారగల సత్త వాషింగ్టన్ సుందర్ కి ఉంది అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోచ్ కటిచ్ ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడి సమయంలో కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచి బౌలింగ్ తో జట్టును విజయతీరాలకు చేర్చే సత్తా వాషింగ్టన్ సుందరికి ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ పరంగా కూడా అతడు మంచి ప్రదర్శన కనబరుస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. సి6 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ గెలిపించే స్థాయికి వాషింగ్టన్ సుందర్ రాబోయే రోజుల్లో చేరుకుంటాడు అంటూ ప్రశంసలు కురిపించాడు.