ఐపీఎల్ : రాజస్థాన్ విజయం.. చెన్నై కి భారీ షాక్..?

praveen
ఐపీఎల్ పోరు ఎంతో రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొన్ని జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు  సంక్లిష్టం అయిన నేపథ్యంలో ఆడిన ప్రతి మ్యాచ్ కూడా విజయం సాధించాల్సిన  పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు వరుస పరాజయాలతో విమర్శలు మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో చివరన ఉన్న జట్లు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి.. మొన్నటి వరకు వరుస విజయాలతో పాయింట్ల పట్టిక లో టాప్ ప్లేస్ లో ఉన్న జట్లు ప్రస్తుతం వరుసగా ఓటమి చవి చూస్తూ ఉండటం గమనార్హం. రోజురోజుకు ఐపీఎల్ లో అంచనాలు తారుమారు అవుతున్నాయి. ఏ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందనే అన్నది కూడా ఊహకందని విధంగా ఉంది అన్న విషయం తెలిసిందే.

 ఇక నిన్న ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ మొత్తం నరాలు తెగే ఉత్కంఠ మధ్య  హోరాహోరీగా జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా 196 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ ముందు ఉంచింది. ఈ క్రమంలోనే ఇక రాజస్థాన్ రాయల్స్ గెలవడం కష్టమనే అని ప్రేక్షకులు అందరూ భావించారు. కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం ఊహించని విధంగా కమ్ బ్యాక్ చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. 196 పరుగుల లక్ష్యాన్ని ఎంతో అలవోకగా చేధించింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. దీంతో ఘన విజయాన్ని అందుకుంది.

 ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ జట్టులో బెన్ స్టోక్స్  చెలరేగి ఆడి వేగంగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సంజూ  శాంసన్  కూడా మళ్లీ ఫామ్ లోకి వచ్చి అర్థ సెంచరీ పూర్తి చేసుకోవడంతో రాజస్థాన్ రాయల్స్  ఎంతో సునాయాసంగా విజయం సాధించింది. అయితే నిన్న రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతయ్యాయి. దీంతో ఐపీఎల్ టోర్నీలో లీగ్ దశలోనే  ఎలిమినేట్ అయిన మొదటి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలవడం గమనార్హం. రాజస్థాన్ విజయంతో చెన్నై కి భారీ షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: