నిన్నటి విజయంతో చెన్నైకి ఊరట.. ఈసారి ఆ రికార్డు నిలబడుతుందా..?

praveen
ప్రతి సీజన్లో ఐపీఎల్లో టైటిల్ ఫేవరెట్గా రంగంలోకి దిగుతుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలో ఎంత విజయవంతంగా  ముందుకు సాగిందో  అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి సీజన్లో కూడా ప్లే ఆప్ కి స్థానం సంపాదించింది చెన్నై జట్టు. అంతేకాదు  మూడు సార్లు టైటిల్ విజేత గా కూడా నిలిచింది. ఇక ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా కూడా చెన్నై జట్టు ముందు స్థానంలో ఉండటం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలోనే చెన్నై జట్టు ఎన్నో రికార్డులు సృష్టించింది.కానీ  ప్రస్తుతం చెన్నై పరిస్థితి చూస్తే మాత్రం కనీసం ప్లేఆఫ్ కి వెళుతుందా  లేదా  అనే అనుమానం కలుగకమానదు.

 ఐపీఎల్ ప్రారంభానికి ముందు నుంచే చెన్నై జట్టు కి వరుస  షాకులు తగులుతున్నాయి. జట్టులో కీలక మైన ఇద్దరు ఆటగాళ్ళు దూరం అవడం... ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్ళు కరోనా  వైరస్ బారిన పడటం... ఇక కరోనా  వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ జట్టులో బ్యాటింగ్ కూర్పు  సరిగా లేకపోవడంతో జట్టు వరుసగా పరాజయాలు పాలవుతూనే ఉంది. ఎప్పుడూ లేనట్టుగా పాయింట్ల పట్టికలో చివరన చేరిపోయింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.దీంతో  అభిమానులు తీవ్ర నిరాశ లో మునిగి పోయారు అని చెప్పాలి. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మంచి కమ్  బ్యాక్  అయింది అని చెప్పాలి. దీంతో అభిమానులందరి లో కొత్త ఉత్సాహం నిండిపోయింది.

 అంతేకాదు అటు పాయింట్ల పట్టికలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి మంచి ఊరట లభించింది.. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు విజృంభించి ఆడటం తో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే చెన్నై జట్టు అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో చిట్ట చివరన ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రస్తుతం ఆరో  స్థానానికి  ఎగబాకింది . అయితే లీగ్ దశ పూర్తయ్యేసరికి టాప్ లో నిలిచిన 4 జట్లు మాత్రమే ప్లే ఆప్ కి అర్హత సాధిస్తు  ఉంటాయి అన్న విషయం తెలిసిందే. చివరి వరకు పాయింట్ల పట్టిక లో కనీసం నాలుగవ స్థానాన్ని సంపాదించి ప్లే ఆప్ కి ఈసారి కూడా చెన్నై జట్టు అర్హత  సంపాదించి గత రికార్డులను నిలబెట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: