సరికొత్త రికార్డు సృష్టించిన జయదేవ్ ఉనద్కట్..
ప్రస్తతం జరుగుతున్న రంజీ ట్రోఫీ లో సౌరాష్ట్ర కెప్టెన్ కమ్ బౌలర్ జయదేవ్ ఉనద్కట్ సరికొత్త రికార్డు సృష్టించాడు. తాజాగా జరిగిన రంజీ మొదటి సెమిస్ లో రెండో ఇన్నింగ్స్ లో గుజరాత్ పై 7వికెట్లు తీయడం తో ఉనద్కట్ 2019-20 సీజన్ లో ఇప్పటివరకు 9మ్యాచ్ ల్లో 65 వికెట్లు తీసుకున్నాడు. తద్వారా రంజీల్లో ఒకే సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన మొదటి పేస్ బౌలర్ గా ఉనద్కట్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు కర్ణాటక బౌలర్ దొడ్డ గణేష్ పేరిట ఉండేది. 1998-99 సీజన్ లో అతను 62వికెట్లు తీసుకున్నాడు. తాజాగా ఆ రికార్డు ను ఉనద్కట్ బ్రేక్ చేశాడు.