2019 లో క్రికెట్ లో తోపులు ఈ నాలుగురేనట..?
క్రికెట్ కి ప్రజల్లో ఉండే క్రేజే వేరు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతుంటారు ప్రేక్షకులు. ఇక తమకు ఇష్టమైన ప్లేయర్ అద్భుతంగా ఆడితే ఆటను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ గంతులు వేస్తూ ఉంటారు. ఒకవేళ తమకు ఇష్టమైన ప్లేయర్ పరుగులు చేయకుండా ఔట్ ఐపోతే విచారంగా ఉండిపోతారు. అంతలా క్రికెట్ ప్రేక్షకులను ప్రభావితం చేసింది. అయితే ప్రపంచంలోని అందరు ఆటగాళ్లు నెంబర్ వన్ స్థానంలో నిలవడానికి ఎంతో కష్టపడతారు అన్న విషయం తెలిసిందే. కానీ నెంబర్ వన్ స్థానం మాత్రం ఒకరికే లభిస్తోంది. ఈ క్రమంలోనే క్రికెట్ ఆటలో ఎంతో మంది ఆటగాళ్లు రికార్డులు బద్దలు కొడుతూ ఉంటారు. ఒక దశాబ్ద కాలం నుంచి రికార్డుల రారాజు గా ఉన్న ఆటగాళ్లు కొంతమంది ఉంటారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటతో వీరు మొదటి వరుసలో ఉంటారు. ఇక వీళ్ల సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి రికార్డు నైనా అలవోకగా సాధిస్తూ టాప్ ప్లేస్లో దూసుకుపోతూ ఉంటారు ఈ ఆటగాళ్ళు . అయితే తాజాగా గత దశాబ్ద కాలంలో ప్రపంచ ఐసీసీ ర్యాంకింగ్స్ లో నలుగురు ఆటగాళ్లు టాప్ లో ఉన్నారని వారు ఎవరో కనుక్కోండి అంటూ ఐసిసి ఓ ఆసక్తికర ట్విట్టర్లో పెట్టింది. అయితే ఈ ట్వీట్ పై స్పందించిన నెటిజన్లు కొన్ని పేర్లను కామెంట్ బాక్స్ లో పెట్టారు. ఇక తాజాగా ఐసీసీ నలుగురు స్టార్ ప్లేయర్స్ పేరును వెల్లడించింది . ఆ నలుగురు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ పీటర్సన్ బాబర్ అజమ్, మోర్గాన్... అని ట్విట్టర్ వేదికగా తెలిపింది.
అయితే ఈ నలుగురు ఆటగాళ్లు గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరికి మించి ఒకరు క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంటారూ . అయితే ఈ నలుగురిలో ఇండియా టీం ఆటగాడు విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. జట్టుకు సారథ్యం వహిస్తు ముందుకు నడిపిస్తూనే... మరోవైపు ఎలాంటి ఒత్తిడి లేకుండా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ఉత్తమ ఆటగాళ్లలో మొదటి స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ. ఫార్మాట్ ఏదైనా రికార్డులు సృష్టించడమే ద్యేయంగా బరిలోకి దిగితే ఎన్నో రికార్డులు బద్దలు కొడుతున్నాడు విరాట్ కోహ్లీ . ఇక ఎంతో మంది ఆటగాళ్లకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాడు.