ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌కు ముందు విచిత్ర‌మైన ప‌రిస్థితి....

VUYYURU SUBHASH
నెలన్నర రోజుల నుంచి ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ మైకంలో మునిగితేలిన భారత క్రికెట్ క్రీడా అభిమానులు అందరూ సెమీఫైనల్లో టీమిండియా ఓటమితో ఒక్కసారిగా నిరుత్సాహంలో కూరుకుపోయారు. న్యూజిలాండ్‌పై ఖచ్చితంగా గెలిచి ప్ర‌ఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఈనెల 14న ఫైనల్ మ్యాచ్ ఆడుతుందని ప్రతి ఒక్కరు ఉన్నారు. వర్ష ప్రభావంతో రిజర్వ్ డే నాడు జరిగిన మ్యాచ్లో భారత బ్యాట్స్‌మెన్స్‌ స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో బొక్క బోర్లా పడ్డారు. దీంతో ప్రపంచ కప్లో భారత్ కథ‌ సెమీఫైనల్లో ముగిసిపోయింది.


ఇక రెండో సెమీ ఫైనల్ లో ఆతిధ్య ఇంగ్లాండ్ ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియా మట్టికరిపించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. అయితే వరల్డ్‌క‌ప్‌లో ఇప్పుడు నిర్వాహకులు ముందు విచిత్రమైన పరిస్థితి నిలిచింది. లీగ్ దశలో టీమిండియా ఊపు చూసిన అభిమానులు ఖ‌చ్చితంగా ఫైనల్ చేరుతుందని భావించి జూలై 14న జరిగే టైటిల్ పోరుకు టికెట్లు భారీగా కొనేశారు. 


లార్డ్స్ కెపాసిటీ 30 వేలు అయితే.. అందులో 80 శాతం టిక్కెట్లు మ‌న‌వాళ్లు కొన్న‌వే. ఇండియా సెమీస్ లోనే వెనుదిరగడంతో వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఫైనల్లో భారత్ ను చూడాలని భావించిన వాళ్లు, ఇప్పుడు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు టైటిల్ కోసం ఆడుతుంటే స్టేడియానికి వచ్చి మరీ మ్యాచ్ చూసే ప‌రిస్థితి లేదు. మ‌రోవైపు త‌మ దేశం 27 ఏళ్ల త‌ర్వాత ఫైన‌ల్‌కు వెళుతుండ‌డంతో ఇప్పుడు ఇంగ్లండ్ వాళ్లు టిక్కెట్ల కోసం వెయిటింగ్‌లో ఉన్నారు.


అంటే భార‌త్ కోసం టిక్కెట్లు కొన్న వాళ్లు త‌మ టిక్కెట్లు రీ సేల్ పెడితేనే వాళ్లు కొనుక్కుంటారు. ఐసీసీ వెబ్ సైట్ లో భారీగా టికెట్ రీసేలింగ్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్ ఫైన‌ల్ ఆడుతుంటే ఆ రెండు జ‌ట్ల అభిమానుల‌కు టిక్కెట్లు దొర‌క‌ని ప‌రిస్థితి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: