సెహ్వాగ్..."సంచలన నిర్ణయం"

NCH Nch

టీమిండియా మాజీ ఓపెనర్..డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేందర్ సెహ్వాగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ కి రాజీనామా ప్రకటించాడు..అంతేకాదు కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేశాడు దాంతో  డీడీసీఏ పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది..అయితే ఈ విషయంపై సెహ్వాగ్ మాట్లాడుతూ బోర్డు అవసరాలని దృష్టిలో పెట్టుకుని నేను బోర్డు కి రాజీనామా చేసానన్..అయితే తనతో పాటు ఆకాశ్ చోప్రా, రాహుల్ సింగ్వీలు కూడా వారి రాజీనామాను చేసినట్టుగా ప్రకటించారు.

 

 అయితే ఈ రాజీనామాలకి కారణం కూడా వారు తెలిపారు..అదేంటంటే..మనోజ్ ప్రభాకర్‌ను బౌలింగ్ కోచ్‌గా తీసుకోకపోవడంతోనే మీరు రాజీనామా చేస్తున్నారా అని అడుగగా దానికి సమాధానంగా అవును అంటూ చెప్పకనే చెప్పాడు సెహ్వాగ్‌ను.. “మేము ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్”  వృద్ధి చెందేందుకు కమిటీగా ఎంతో కృషి చేశాం...అయితే మా సూచనలు.. సలహాలు పనికిరానప్పుడు డీడీసీఏలో మేం కొనసాగలేమనే నిర్ణయాన్ని అసోసియేషన్‌కు తెలిపామని అన్నారు.

 

అంతేకాదు  మా దైనందిక జీవితాల్లో బిజీగా ఉండడంతో మేం తప్పుకుంటున్నాం.' అని పేర్కొన్నాడు...అయితే ప్రభాకర్ నియామకం విషయంలో గౌతం గంభీర్ సైతం వద్దని చెప్పడంతో  సెహ్వాగ్... గంభీర్ ఇద్దరి మధ్య ఓ చిన్నపాటి యుద్దమే జరుగుతోంది. అతనొక మ్యాచ్ ఫిక్సర్ అని అతని తీసుకోకూడదంటూ గంభీర్ పట్టుపట్టాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: