దేవుడిని ఇలా మీరు కూడా చూడొచ్చు..? ప్రయత్నిస్తారా..?

అసలు దేవుడు ఉన్నాడా.. ఉంటే ఎక్కడు ఉన్నాడు.. మనకు ఎందుకు కనిపించడు.. దేవుడే ఉంటే ఇన్ని అరాచకాలు దేశంలో ఎందుకు జరుగుతున్నాయి.. ఇలాంటి అనుమానాలు మనలో చాలా మందికి వస్తాయి.. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు.. ఆయన్ను చూడటం సాధ్యమేనా చూద్దాం..రండి..



దేవుడు ఎక్కడో కొండకోనల్లోనో.. ప్రఖ్యాత ఆలయాల్లోనో.. ఉండడు.. ఆయన నిత్యం మనలోనే ఉంటాడు.. మన ఆత్మలోనే ఆయన ప్రకాశిస్తుంటాడు.. దేవుడు వేరు నేను వేరు అన్న భావనతో మనం మనలోని ఈ దైవాన్ని గుర్తించలేం. దైవం అంతటా అందరిలోనూ ఉంటాడు గనుక నేను వేరు, వాడు వేరు అనే భేద భావం చూపకుండా ప్రతి జీవిని ఆదరించాలి.



అందరిలో ప్రకాశించే దివ్యత్వాన్ని గుర్తించాలి .. ఇవీ సాయిబాబా చెప్పే ప్రవచనం. మరి మనలోని దేవుడిని గుర్తించేదెలా.. ఇందుకు విశ్వాసమే ప్రధాన ఆయుధం. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ‘‘నమ్మకంతో ఎవరు ఏ రూపంతో నన్ను ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారి అంతరాత్మలో దర్శనమిస్తాను అంటాడు కదా.




ఎందరెందరో మహానుభావులు ఎన్నెన్నో విధానాలు ఆచరిస్తూ అంతరంగంలో అలా పరమాత్ముణ్ణి దర్శించి తరించారు. తన శరణు జొచ్చిన పావురంలో దైవాన్ని చూసిన శిబి చక్రవర్తి, దాన్ని డేగ బారి నుండి రక్షించేందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి తొడ మాంసాన్ని కోసి యివ్వ సిద్ధపడ్డాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి జూచిన అందందే గలడు దానవాగ్రణి అనే సుభాషితాలు వాడుకలోకి వచ్చాయి. మరి మీరూ ప్రయత్నించి చూడండి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: