శివరాత్రి రోజున పొరపాటున కూడా వీటిని అసలు కొనకండి..?

frame శివరాత్రి రోజున పొరపాటున కూడా వీటిని అసలు కొనకండి..?

Divya
మహాశివరాత్రి ని హిందువులు చాలా పవిత్రమైన పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు చాలా మంది ప్రజలతో పాటు, శివ భక్తులు కూడా ఉపవాసం లాంటివి చేస్తూ ఉంటారు. శివుడికి ఈరోజు ప్రత్యేకమైన పూజలు చేసి తమ కోరికలు శివుడి దగ్గర చెప్పుకొని.. మరి శివుడు ఆశీస్సులను పొందడానికి చూస్తూ ఉంటారు. అలాగే ఈరోజు రాత్రంతా కూడా జాగారం చేస్తూ ఉంటారు. అయితే శివరాత్రి రోజున కొన్ని రకాల వస్తువులను కొనకూడదట. వాటి గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.


శివరాత్రి రోజున ఎవరూ కూడా లెదర్ తో చేసిన వస్తువులను కొనకూడదట.. ఇవి ఇంటికి ప్రతికూల శక్తిని తీసుకువచ్చేలా చేస్తాయట. ముఖ్యంగా హ్యాండ్ బ్యాగులు, చెప్పులు ,పర్సులు వంటివి అసలు కొనకూడదు.


ఎవరైనా ఆల్కహాల్ తాగేవారు శివరాత్రి రోజున మద్యం తాగు కూడదట.. ఉదయం పూట శివుడిని పూజించి రాత్రి సమయాలలో మద్యం సేవిస్తే ఫలితం దక్కదు.. అందుకే పూజలు మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే ఈ ఒక్కరోజు తాగకుండా ఉండడం మంచిదట.


శివరాత్రి రోజున ఇంట్లోకి విరిగిన వస్తువులను అసలు తీసుకురాకూడదట .ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా వాటిని బయటకు పారేయడం మంచిది.


శివరాత్రి అనేది కూడా చాలా శుభ సందర్భం కావున ఈ రోజున కత్తెర, సూది, కత్తి వంటి వాటిని కొనడం అశుభంగా భావిస్తూ ఉంటారు. అందుకే శివరాత్రి రోజున ఎలాంటి పదునైన వస్తువులను సైతం ఇంటికి తీసుకురాకూడదు.


ఇక శివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయానికి వస్తే పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 26న ఉదయం 11:08 నిమిషాల నుంచి రాత్రి 10:05 నిమిషాల వరకు చేసుకోవచ్చట. అయితే కొంతమంది పండితులు సైతం గ్రంథాలు తెలుపుతున్న ప్రకారం శివుడు మహాకాలుడు కాబట్టి శివరాత్రి రోజున ఎప్పుడైనా కూడా మనం శివుడిని పూజించడం వల్ల అంతా మంచే జరుగుతుందని తెలుపుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: