పువ్వులతోనే దేవుడిని ఎందుకు పూజిస్తారు.. పండితులు ఏం చెబుతున్నారంటే?

praveen
మన ఇండియా సకల సంస్కృతుల సమ్మేళనం అన్న విషయం తెలిసిందే. ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఎన్నో మతాలు ఎన్నో సంస్కృతులు కనిపిస్తూ ఉంటాయి. ఒక రకంగా దైవారాధనకు ఇండియా పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా హిందువులు అయితే పూజలుకు ఎంత ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా పూజలు చేసి భగవానుడి కృప కటాక్షాలను పొందాలని అనుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఇక ప్రతి ఒక్కరూ ఇంట్లో లేదంటే గుడికి వెళ్లి భగవంతుడిని ఆరాధిస్తూ తమ సాంప్రదాయాలకు అనుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. తమ కోరికలను తీర్చాలని తమ కుటుంబాన్ని సుఖసంతోషాలతో మెలిగేలా చూడాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇలా పూజలు చేయడం గురించి అందరికీ తెలుసు. అయితే ఏ పూజ చేసిన కూడా ఆ పూజలో పూలతోనే దేవుడిని ఆరాధించడం చూస్తూ ఉంటాం. ఇలా పూజ ఏ దేవుడికైనా  పుష్పాలదే ప్రాధాన్యత ఉంటుంది.

 అయితే ఇప్పుడు వరకు ప్రతి ఒక్కరు కూడా ఇలా పుష్పాలతోనే అటు భగవంతుడిని ప్రార్థించి పూజ కార్యక్రమం చేస్తు ఉంటారు. కానీ ఎందుకు కేవలం పుష్పాలతోనే భగవంతుడికి పూజ చేస్తారు అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. పుష్పాలలో సర్వదేవతలు ఉంటారని ప్రతితి. అయితే పువ్వుల్లో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నమవుతారట. ఇక దేవుడికి పువ్వుల సువాసన అంటే కూడా మహా ఇష్టమని చెబుతూ ఉంటారు. పుష్పం త్రివర్గ సాధనం  కాబట్టి సంపద స్వర్గం మోక్షాన్ని కలిగిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారట. ఇక దేవుళ్లకు ఇష్టమైన పూలతో పూజలు నిర్వహిస్తే కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి. అయితే నేటి రోజుల్లో చాలా మంది ఇలా పూలతో పూజలు నిర్వహిస్తున్నప్పటికీ.. పూలను ఎందుకు ఉపయోగిస్తారు అన్న విషయం మాత్రం తెలియకుండానే పూజలు చేస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: