దసరా ఎప్పుడు జరుపుకోవాలి.. ఏ సమయంలో అంటే..?
ప్రతి ఏడాది కూడా దసరా పండుగ అస్వయజ మాస శుక్లపక్షంలో పదవ రోజున జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందట. ఆరోజు దుర్గాదేవి మహిషాసురుని వధించిన రోజుగా పిలుస్తారు. అయితే హిందువుల క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12వ తేదీన ఉదయం 10:58 నిమిషాలకు అశ్వయుజ మాసం దశమి మొదలవుతుందట. ఆ మరుసటి రోజు ఉదయం అక్టోబర్ 13న ఉదయం 9.08 నిమిషాల వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది. తిధి ప్రకారం చూసుకుంటే అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగ చేసుకోవాలి. హిందువులు నమ్మిన ప్రకారం ప్రదోష కాలంలో రావణ దహన కాండ జరిగిందని పురాణాలు సైతం తెలియజేస్తూ ఉంటాయి.
అందుకే వాటినే పాటిస్తూ ఉంటారు హిందువులు. పంచాంగం ప్రకారం అక్టోబర్ 12వ తేదీన సాయంత్రం 5:53 నుంచి 7:27 నిమిషాల వరకు రావణ దహన కాండ చేయాలి. ఇక దసరా రోజు మధ్యాహ్నం 2:03 నుంచి 2:49 నిమిషాల మధ్యలో శాస్త్ర పూజ లేక ఆయుధ పూజలు చేయవలసి ఉంటుంది.. ఈ ఆయుధ పూజకు కేవలం 46 నిమిషాలు మాత్రమే ఉన్నది. ఇది చెడు పైన విజయాన్ని అందుకోవడం వల్లే దసరాని జరుపుకుంటూ ఉంటారు.. అయితే ఈ రోజున అందరికీ మంచి శుభ శకునం కావడం చేత చాలామంది ఈ రోజున కొత్త పనులు ప్రారంభించడం లేకపోతే ఏదైనా కొత్త వాహనాలను లేదా ఆభరణాలు వంటివి కొనడం చేస్తూ ఉంటారు. అందుకే హిందువులు ఈ పండుగను 12వ తేదీన జరుపుకుంటున్నారు.