కుటుంబంలో ఆర్థిక వృద్ధిని పెంచే విగ్రహాలు ఏంటో తెలుసా..?

Divya
కొన్ని కుటుంబాలలోని వ్యక్తులు ఎంత కష్టపడి పని చేసినా,అనుకున్న పనులు సరిగా జరగక, దురదృష్టం,కాలం కలిసి రాక,నరద్రుష్టి వంటి కారణాల వల్ల ఆర్థిక అభివృద్ధి జరగదు.ఇలాంటి దోషాలు అన్నింటికీ నివారణ కోసం కొన్ని రకాల విగ్రహాలు మన ఇంట్లో పెట్టుకోవాలని జాతకనిపుణులు చెబుతున్నారు. హిందూ సంప్రదాయంలో విగ్రహాలను,చెట్లను పూజించడంతో దృష్టి దోషాలను పోగొట్టుకుంటూ ఉంటారు.ముఖ్యంగా కొన్ని రకాల జంతువుల విగ్రహాలను పెట్టి పూజించుకోవడం వల్ల కుటుంబంలో ఆర్థిక అభివృద్ధి జరిగి సుఖశాంతులు నెలకొంటాయి. అలాంటి విగ్రహాలేంటో వాటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ఏనుగు విగ్రహం..
లక్ష్మీదేవి వాహనమైన ఏనుగుల విగ్రహాలు ఇంట్లో ఉంచి పూజించుకోవడం వల్ల,లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్టు అవుతుంది.మరియు శాస్త్రం ప్రకారం ఏనుగు ఐశ్వర్యానికి చిహ్నంగా కొలుస్తారు కూడా.ప్రతి శుక్రవారం ఏనుగులను విగ్రహాలను పూజించుకోవడం వల్ల ఇంట్లో ఆర్థికవృద్ధి జరిగి,సుఖసంతోషాలు కలుగుతాయి.మరియు రాహుదోషంతో బాధపడేవారు, వెండి లేదా ఇత్తడి ఏనుగుల విగ్రహాలను పూజించడం ఉత్తమం.
పరిగెత్తే గుర్రాల విగ్రహాలు..
ఇంట్లో ఆర్థిక వృద్ధి నత్తనడక నడుస్తూ ఉంటే, లేదా వ్యాపారం వ్యాపారం మందకొడిగా జరుగుతూ ఉన్నట్టయితే,అలాంటివారు పరిగెత్తే గుర్రాల విగ్రహాలను ఉంచుకొని,ప్రతి మంగళవారం పూజించాలి.దీనితో గుర్రం పరిగెత్తినంతా స్పీడుగా వారి వ్యాపారం కూడా సజావుగా జరుగుతుంది.
చేప విగ్రహాలు..
ఇత్తడి చేపలు కానీ,వెండి చేపలు కానీ ఇంట్లో ఉంచుకోవడం వల్ల పురోభివృద్ధిని కలిగిస్తాయి.కాబట్టి వాటిని ఇంట్లో ఈశాణ్యం వైపు ఉంచడం మంచిది.దీంతో కుటుంబానికి ఆదాయం పెరిగి,సంతృప్తిగా వుంటారు.
తాబేలు విగ్రహాలు..
ఇంట్లోకి తెచ్చిన తాబేలుకు ఆది విష్ణువుకు ప్రతి రూపంగా భావించి కొలుస్తారు.కావున ఆ విగ్రహాలను తూర్పు లేదా ఉత్తర దిక్కున ఉంచి పూజించాలి. మీరు ఇంటికి తెచ్చే ముందు తాబేలు బొమ్మలో ఏదైనా లోహం ఉందో లేదో గమనించుకోండి.ఇలా ప్రతి శనివారం తాబేలు విగ్రహాలను ఎర్రటి పూలతో పూజించడం వల్ల,ఆదాయ వనరులు పెరిగి,ఇంట్లో శాంతి,సంతోషాలు నెలకొంటాయి.కావున విపరీతంగా ఆర్థిక సమస్యలు అనుభవించే వారు,వారి ఇంట్లో పైన చెప్పిన విగ్రహాలు తెచ్చుకొని పూజించడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: