ఇంట్లోని చీపురుని ఏ వైపున ఉంచుకోవాలో తెలుసా..?

Divya
మన సనాతన దర్మంలో ఒక్కో వస్తువుకి ఒక్కోరకమైన ప్రాధాన్యం ఉంది.మరియు కొన్ని వస్తువులను కొన్ని దేశాల్లో మాత్రమే ఉంచుకోవాలి లేదంటే ఇంట్లో అశాంతి ఎలగొంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా చీపురును ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఉంచుకోకూడదు అని మన సాంప్రదాయాలు చెబుతున్నాయి. హిందూ సంప్రదాయంలో చీపురుకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. అలాంటి అలాంటి చీపురును కొన్నికొన్ని దేశాల్లో మాత్రం పెట్టుకోవాలని నియమాలు ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి ఒక్కరూ చీపురును ఆగ్నేయ దిశలో మాత్రమే ఉంచుకోవాలి.ఈ దిశలోఉంచుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి,ఇళ్ళు ప్రశాంతంగా ఉంటుంది. మరియు చీపురును ఈశాన్యం దిశలో అస్సలు ఉంచుకోకూడదు.ఈ దిక్కులో చీపురును ఉంచితే ఇంట్లోని వారికి అశుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతుంటారు.
చీపురు విషయంలో పాటించవాల్సిన నియమాలు..
చీపురును అస్సలు కాలితో తన్నకూడదు.దీనిని లక్ష్మి దేవి స్వరూపంగా భావిస్తాం కనుక.మరియు చీపురు తిరగేసి ఉంచకూడదు.ఇలా ఉంచడం వల్ల మన ఇంటి పరిస్థితితులు తిరిగేసినట్టు అయి, మనం ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి.
చీపురుని కొన్ని ప్రాంతాల్లో డోర్ పక్కనే ఉంచుతుంటారు. అలా ఉంచకూడదు. ఇంట్లోకి రావాల్సిన ధనలక్ష్మికి అడ్డుగా ఉంటుంది. దాని వల్ల ఆర్థిక సమస్యలు మొదలయే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా చీపురును పెరట్లో ఏదైనా హ్యాండిల్ పెట్టి వేలాడదియాలి.అలా చేయడం వల్ల, ఇళ్ళు శుభ్రంగా కనిపిస్తుంది.మరియు లక్ష్మిదేవి రావడానికి మార్గం సుగమనం అవుతుంది.
కొన్నిచోట్ల చీపురును దిష్టి తీయడానికి  వాడుతుంటారు. ఇలా దిష్టి తీయడానికి వాడిన పరకలు మళ్ళీ ఇంట్లో ఉపయోగించకూడదు.దీనివల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇంటి నుంచి ఎవరైనా,ఏదయినా పని మీద వెళ్ళేటప్పుడు చీపురు పట్టుకొని ఎదురు వెళ్ళరాదు. దాని వల్ల వారికీ వెళ్లిన పనిలో ఆటంకం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు.కావున చీపురు విషయంలో పైన చెప్పిన జాగ్రత్తలు పాటించడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: