కాకి గోలకు పురాణాల్లో ఎలాంటి అర్థాలు ఉన్నాయో తెలుసా..!

Divya
కాకిని సంస్కృతంలో వాయసం అంటారు.సాధారణంగా కాకి అరుపులు ఎవరికీ ఇష్టం ఉండవు.ఎవరైనా గట్టిగ మాట్లాడుతుంటే,వారిని ఎందుకు కాకిలా అరుస్తున్నావ్ అంటారు కదా..కానీ కాకి చేసే కొన్ని పనులకు కూడా కొన్నిరకాల అర్థాలు వున్నాయట.అ పనుల వల్ల మన భవిష్యత్తులో ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో ముందుగా తెలుసుకోవచ్చని వేదపండితులు చెబుతున్నారు.అ ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటిపై కాకి అరుస్తూ ఉంటే,తొందరలో మన ఇంటికి బంధువులు వస్తున్నారని గ్రామాల్లో అంటూవుంటారు. కానీ కొంతమంది అది ఒట్టి అపోహని కొట్టిపారేస్తూ ఉంటారు.కొన్ని పురాణాల్లో ఈ విషయం ఉందని, వేదాలు చదివినవారు అది నిజమేనని అంటున్నారు.
ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కాకి కుండలోని నీళ్లు తాగుతూ ఉండడం మన కంటబడితే,అది మనకు త్వరలో అధిక డబ్బు రాబోతుందని అర్థమట.మరియు కాకి ముక్కుతో ఆహారం పట్టుకొని ఎగురుతున్నట్లు చూస్తే,ఇంట్లో ఏదో శుభకార్యం జరగబోతుందని,పగటి సమయంలో ఉత్తరం కానీ,తూర్పున కానీ కాకి అరుస్తున్నట్టు వినిపిస్తే,ఏదొక మంచి జరుగుతుందని అర్థం.
కాకి ఒక్కోసారి మనుషులను ముడుతువుంటుంది. అలాంటప్పుడు అది అ వ్యక్తి యొక్క శరీర భాగాన్ని, ముడితే,పెద్దల ఆస్తి పరంగా మీకు డబ్బు రాబోతోందని అర్థమట.కానీ కాకి ఎగురుతూ తలను ముడితే, అనారోగ్య సమస్యలు కలిగి,ఆర్థిక సమస్యలు రాబోతున్నట్టు సూచిస్తుంది.కావున బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని,కాకి ముట్టకూడదని పెద్దలు చెబుతుంటారు.
ఎక్కడైనా కాకులమంద కొట్టుకున్నట్టు చూస్తే,మనకు ఏదో ప్రమాదం పొంచి ఉందని,మీరు పెద్ద విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం.ఇంటి మేడపై కాకులు ఎక్కువగా అరుస్తుంటే ఆ కుటుంబ పెద్దకు ఏదో కీడు జరుగుతుందని అర్థం.ఇది మన పెద్దలు కూడా చెబుతుంటారు.కాకులకు మనిషికి జరిగే మంచి,చెడులను అంచనా వేయగల సామర్థ్యం ఉందంటారు.అంతే కాక వాటికి హాని చేసిన వారిని గుర్తుపెట్టుకొని, పగ కూడా తీర్చుకుంటాయట.

విష్ణుపురాణం ప్రకారం కాకిని చనిపోయిన వారి ప్రతి రూపంగా భావిస్తారు.పితృ దేవతలకు పిండాలు పెట్టినప్పుడు అవి తినేవరకు వేచి వుంటారు.కావున కాకి గోలకు కూడా అర్థం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: