ధన ప్రాప్తి కలగాలంటే హోలీ పండుగ రోజున ఇలా చేసి చూడండి..!

Divya
సాధారణంగా హోలీ పండగ అంటే రకరకాల రంగులతో,పిండి పదార్థాలతో చేసుకోవడం అని అందరికీ తెలుసు. కానీ హోలీ పండుగకు ఒక కథ ఉంది. అదేంటంటే విష్ణుభక్తుడైన హిరణ్యకష్యపుడికి,నారాయణుడి భక్తుడైన ప్రహల్లాదుడు జన్మిస్తాడు.కానీ హిరణ్యకష్యపుడికి ప్రహల్లాదుడు నారాయణ స్మరణ చేయటం అసలు ఇష్టం ఉండదు. దానితో ప్రహల్లాదుని నారాయణ స్మరణ చేయడం ఆపమని చెబుతుంటాడు. కానీ ప్రహల్లాదుడు తన తండ్రి మాట వినకుండా నారాయణ స్మరణ చేస్తుంటాడు. దీనితో హిరణ్యకష్యపుడికి కోపం వచ్చి ప్రహల్లాదుని చంపేయాలని అనుకుంటాడు. రకరకాలుగా ప్రయత్నించి ప్రహల్లాదని చంపాలని చూసిన, ప్రహల్లదుడు మరణించక తిరిగి వస్తూ ఉంటాడు. 


దీనితో తన చెల్లి అయిన హోలిక దేవిని పిలిచి ప్రహల్లాదున్నీ తీసుకొని మంటల్లో దూకమని చెప్తాడు హిరణ్యకష్యపుడు.ముందుగానే హోళిక దేవికి మంటల్లో కాలిపోకుండా ఉండే వరం ఉంటుంది.దీనీతో తన అన్న చెప్పిన మాట విని హోళికాదేవి ప్రహల్లాదున్ని తీసుకొని మంటల్లోకి దూకుతుంది. కానీ నారాయణ భక్తుడు అవడం వల్ల ప్రహ్లాదుడు తిరిగి మంటలనుంచి బయటపడతాడు.కానీ హోలికాదేవి దహనమైపోతుంది. అప్పటినుంచి చెడు దహించుకుపోయి మంచి గెలిచిందని, ఆ ప్రజలంతా రంగులు జల్లుకుంటూ,హోలీ పండుగ జరుపుకుంటారు. ఇంత మహిమ కలిగిన హోలీ పండుగ రోజు కొన్ని రకాల పూజలు చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి,పాజిటివ్ ఎనర్జీ వచ్చి తన ప్రాప్తి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. ఆ పూజ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
ఈ సంవత్సరం హోలీ పండుగ మంగళవారం,పౌర్ణమి కలిసి వచ్చాయి. ఈ రోజున మన ఇంటి దగ్గరలో ఏదైనా గుడిలో నిత్యం పూజించే అమ్మవారి విగ్రహం ఉంటే, ఆ అమ్మవారిని పూజించడం చాలా ఉత్తమం. హోలీ పండుగ రోజు తెల్లవారుజామున నిద్రలేచి,తల స్నానం చేసి,నైవేద్యంగా ఉప్పు వేయకుండా పెసర్లతో పులగం చేయాలి.ఈ ప్రసాదమును తీసుకొని వట్టి కాళ్లతో నడుచుకుంటూ వెళ్లి, అమ్మవారిని భక్తి శ్రద్దలతో మన కోర్కెలు కోరుకొని ప్రసాదం సమర్పించాలి.దీనితో మన ఇంట్లో ఉన్న బాధలన్నీ తొలగి, ధన ప్రాప్తి కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: